వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడి ఆవరణలో హిందూ అమ్మాయి ఖురాన్ బోధన

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లో మతసామరస్యం వెల్లి విరిసింది. ఓ హిందూ బాలిక ముస్లీం పిల్లలకు ఖురాన్ బోధిస్తోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరం సంజయ్ నగర్ కాలనీలోని దేవాయ ఆవరణలో నిత్యం జరుగుతోంది.

పద్దెనిమిదేళ్ల పూజా కుష్వాహా అనే అమ్మాయి పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె దేవాలయం ఆవరణలో ప్రతిరోజు ముస్లీం పిల్లలకు ఖురాన్ పాఠాలు బోధిస్తూ లౌకికత్వాన్ని చాటి చెబుతోంది. ఆమె అందరి మన్ననలు అందుకంటోంది.

This 18 year old Hindu girl teaches Quran to Muslim kids

ఖురాన్‌పై తనకున్న పట్టుతో ఆ కాలనీలోని 35 మంది ముస్లిం చిన్నారులకు ఆమె దానిని బోధిస్తోంది. హిందూ బాలిక అయినా ఖురాన్‌ను చాలా చక్కగా బోధిస్తుండడంతో ముస్లిం కుటంబాలు తమ పిల్లలను పూజ వద్దకు పంపిస్తున్నారు.

అయిదేళ్ల చిన్నారి అలీషా తల్లి రేష్మా బేగం మాట్లాడుతూ... పూజ ప్రతిభకు తాము ముగ్ధులవుతున్నామని, ఇంత చిన్న వయసులోనే ఆమె ఖురాన్‌ను అద్భుతంగా బోధిస్తోందని, ఆమె వద్దకు తమ పిల్లలను పంపడం ఆనందంగా ఉందని చెబుతోంది. అందరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇదే కాలనీలో సంగీతా అనే మహిళ ఉండేది. ఆమె తండ్రి ముస్లిం, తల్లి హిందూ. పిల్లలకు ఆమె ఖురాన్ చెప్పేంది. దీంతో పూజ కూడా దానిని నేర్చుకోవాలనుకుంది. ఖురాన్ క్లాసులకు హాజరయింది. ఖురాన్‌ను ఒంటబట్టించుకొంది. ఆ తర్వాత సంగీత క్లాసులు ఆపేసింది. దీంతో పూజ ప్రారంభించింది.

English summary
In the communally restive western UP, an open-air classroom held every evening in a temple premises in Agra's Sanjay Nagar colony offers hope and also a rare insight into the state's composite culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X