వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికల పుణ్యమాని రికార్డులు బద్దలు కొట్టిన ట్విట్టర్ .

By Narsimha
|
Google Oneindia TeluguNews

శాన్ ప్రాన్సిస్కో :అమెరికా ఎన్నికల్లో తమ మద్దతుదారులకు అనుకూలంగా సామాజిక మాద్యమాలను ఉపయోగించుకొన్నారు ఆయా పార్టీలకు చెందిన వారు . ఎన్నికల రోజున ట్విట్టర్ లో రికార్డు స్థాయిలో ట్వీట్ లు వచ్చి పడ్డాయి. ఆయా పార్టీల మద్దతుదారులు, తమ మద్దతును చేసిన ట్వీట్లతో ట్విట్టర్ రికార్డు సృష్టించింది.ఒకేరోజున 3.5 కోట్ల ట్వీట్లతో ట్విట్టర్ రికార్డు బ్రేక్ చేసింది. గత ఎన్నికల రోజుతో పోలిస్తే ఈ దఫా అత్యధికం.
ట్విట్టర్ లో కోట్లాది ట్వీట్లు వచ్చి పడ్డాయి బుదవారం ఉదయానికే కోట్ల ట్వీట్లు వచ్చినట్టు గుర్తించారు. ఉదయం తర్వాత వచ్చిన ట్వీట్ల సంఖ్యను ఇంకా లెక్కించాల్సి ఉంది. బుదవారం ఉదయం ఏడున్నర గంటకు 3.5 కోట్ల మంది ట్వీట్లు చేశారు.

 twitter record break

ట్విట్టర్ చరిత్రలో ఇది రికార్డు ట్విట్టర్ వర్గాలు చెబుతున్నాయి.గతంలో కూడ అమెరికా ఎన్నికల సందర్భంగా ఇదే తరహాలో ట్విట్టర్ లో ట్వీట్ల వరద పారింది. ఈ దఫా ఎన్నికల్లో కూడ ట్వీట్ల వరద సాగింది.గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎన్నికలకు ట్వీట్ల సంఖ్య పెరిగింది.

2012 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన రోజున అత్యధికంగా 3.20 కోట్ల ట్వీట్లు చేశారు. అయితే ఈ రికార్డు ఈ దఫా బద్దలైంది. ఈ దఫా ఎన్నికల రోజున బుదవారం ఉదయం ఏడున్నరగంటలకు 3.5 కోట్ల ట్వీట్లు పోస్టయ్యాయి. అమెరికా ఎన్నికలకు సంబందించే ఈ ట్వీట్లు ఉన్నాయి.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు కోటి 31 లక్షల మంది, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు కోటి నాలుగు లక్షల మంంది మద్దతుదారులు ఉన్నారు.ఎవరి మద్దతుదారులు వారికి అనుకూలంగా ట్విట్టర్ లో ట్వీట్ల వరద సృష్టించారు.

English summary
twitter record break , 3.5 crores of tweets on election day of an america.in 2012 3.20 crores of tweets on the poll day. this time 3.5 crores of tweets on the poll day, this is the record break of our history said twitter management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X