వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనాథకు అంతా కలిసి పెళ్ళిచేశారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎవరూ లేని అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోప్పోయింది.కాని, ఆమెకు వివాహం చేసేందుకు స్థానికులు పెళ్ళి పెద్దలుగా మారారు. తమ కూతురుగా ఆ యువతిని పెళ్ళికి సిద్దం చేశారు. ఆదివారంనాడు ఆమె వివాహం జరగనుంది.

ఎవరూ లేరని అనాథగా ఉన్న యువతికి అందరూ తామై అక్కున్న చేర్చుకొన్నారు.కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల ఇంచార్జ్ పద్మావతి, హైదర్షాకోట్ గ్రామ సర్పంచ్ పి. కృష్ణారెడ్డి మౌనిక అనే అనాథ యువతికి ఘనంగా ఆదివారం నాడు వివాహం జరుపుతున్నారు.

మౌనిక అనే యువతి తల్లిదండ్రులు చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఎవరూ లేకపోవడంతో ఆమెను చిన్నతనంలోనే పోలీసులు హైదర్షాకోట్ లోని కస్తూర్భా గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.ఇంటర్ వరకు చదివించారు ఆశ్రమ నిర్వాహాకులు.

villagers come forward to marry orphan

మౌనిక మేజర్ అయింది. ఆమెకు వివాహం చేయాలని ఆశ్రమ నిర్వహాకులు నిర్ణయం తీసుకొన్నారు.రాజు అనే యువకుడు మౌనికను వివాహం చేసుకొనేందుకు ముందుకు వచ్చాడు. మౌనిక వివాహం కోసం హైదర్షాకోట్ సర్పంచ్ కృష్ణారెడ్డి , స్థానికంగా ఉన్న గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు.దీంతో మౌనిక వివాహం వైభవంగా నిర్వహిస్తున్నారు.

కన్యాదానానికి ముందుకు వచ్చిన పెద్దలు

ఎవరూ లేని అనాథ మౌనికకు గ్రామస్థులు, ఆశ్రమ నిర్వహాకులు కుటుంబసభ్యులయ్యారు. అందరి వివాహాలు జరిగినట్టుగానే మౌనిక వివాహాన్ని నిర్వహిస్తున్నారు.మౌనికకు కన్యాదానం చేసేందుకు గాను హైదర్షాకోట్ కు చెందిన సర్పంచ్ కృష్ణారెడ్డి ముందుకు వచ్చాడు. పెళ్ళి కొడుకు తరపున కన్యాదానం స్వీకరించేందుకు రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ వి. చంద్రశేఖర్ దంపతులు ముందుకు వచ్చారు.

తమ అమ్మాయి వివాహానికి రావాలంటూ వివాహా కార్డులను ముద్రించి పంచారు. తమ కూతరు వివాహం జరిపించినట్టుగానే వివాహా వేడుకలను నిర్వహిస్తున్నారు.మౌనికను పెళ్ళికూతురును చేసిన కృష్ణారెడ్డి దంపతులు సంగీత్ ను కూడ నిర్వహించారు. వివాహం లో ఎలాంటి టోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆదివారం నాడు వివాహం జరగనుంది. వివాహం కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

English summary
mounika young lady. when she was child, her parents died in road accident.police admitted in to her haidershakotla orpan house.now she is inter, orphan managements decided to marry her. raju came forward to marry her,haidarshakotla sarpanch krishna reddy family to take responsible mounika. rajendra nagar deputy collector take responsible for raju. on sunday mounika, raju wedding .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X