వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ట్వీటులో పొరపాటు: థ్యాంక్స్ చెప్పిన అష్రఫ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో అక్టివ్‌గా ఎంతో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ప్రతీ ప్రత్యేక పర్వదినాలు.. ప్రముఖుల పుట్టిన రోజు సందర్భంగా మోడీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాగా, అలా శుభాకాంక్షలు తెలియజేయడంలో తాజాగా చిన్న పొరపాటు జరిగింది.

ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ గనికి శుక్రవారం మోడీ ట్విట్టర్‌ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అష్రఫ్‌ గని పుట్టిన రోజు మే 19న. మోడీ ట్వీట్‌కి స్పందించిన అష్రఫ్‌ గని ధన్యవాదాలు తెలుపుతూ.. తన పుట్టిన రోజు నేడు కాదని.. మే 19న అంటూ రీ ట్వీట్‌ చేశారు.

When Modi goofed up Afghan Prez’s birthday on Twitter and got trolled

కాగా, గూగుల్‌లో మాత్రం అష్రఫ్‌ పుట్టిన రోజు ఫిబ్రవరి 12 అని ఉండటంతో మోడీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై నెటిజన్లు స్పందించారు.

కొందరు మోడీని వ్యంగ్యాస్తాలు సంధించగా.. మరి కొందరు గూగుల్‌లో తప్పులు ఉంటున్నాయని.. ప్రముఖుల పుట్టిన రోజు తేదీలను కూడా అప్‌డేట్‌ చేయడం లేదని విమర్శించారు. దీంతో అప్రమత్తమైన గూగుల్ గని పుట్టిన రోజు తేదీని మే 19కి మార్చేసింది.

English summary
Prime Minister Narendra Modi’s penchant for greeting his fellow world leaders on micro-blogging site Twitter backfired on Friday after he mistakenly wished Afghanistan’s President Ashraf Ghani Happy Birthday; three months too early.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X