హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: ‘మంగళసూత్రం ఉందని గ్రూప్2 పరీక్ష రాయనీయలేదు’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రూప్2 పరీక్షల నిర్వహణ కోసం టీఎస్ పీఎస్సీ విధించిన నిబంధనలతో పలువురు అభ్యర్థువులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓ మహిళ అయితే ఏకంగా పరీక్ష రాయకుండానే వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బూట్లు వేసుకోరాదని, పర్సులు, ఎలాంటి ఇతర వస్తువులు తీసుకురాకూడదని, మెడలో చైన్లు, గొలుసులు వేసుకురాకూడదనే నిబంధనలను పరీక్షకేంద్రాల్లో అధికారులు కఠినంగా అమలు చేశారు.

ఒంటిపై ఉన్న చైన్లు, రింగులు, క్యాష్, గాజులు, మెట్టెలు, మంగళసూత్రాలు తీసేసి పరీక్ష హాలులోకి వెళ్లాలని అధికారులు చెప్పారు. దీంతో, పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు. పలువులు మహిళా అభ్యర్థులతో పాటు, వారి భర్తలు కూడా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

mangalasutra

ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని భోలక్ పూర్ లోని అంజుమన్ సొసైటీ పరీక్ష కేంద్రం వద్ద ఓ మహిళా అభ్యర్థినిని మంగళసూత్రం తీసి పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని అధికారులు చెప్పారు.

అసలే శుక్రవారం... తాను ఎట్టి పరిస్థితుల్లోను మంగళసూత్రం తీయనని ఆమె వాదించింది. అయినప్పటికీ, రూల్స్ ఒప్పుకోమంటూ సిబ్బంది స్పష్టంగా చెప్పేశారు. దీంతో, ఆమె పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. ఇలాంటి నిబంధనలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

English summary
A woman allegedly came out from a group2 exam centre in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X