కోడలు రాక్షసత్వం సిసిటీవీతో బయటపడింది(వీడియో)
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ కోడలు తన అత్తను దారుణంగా చిత్రహింసలు పెడుతున్న ఓ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. మంచానపడిన అత్త మెడకు తాడు బిగించడం, బండరాయితో మోదడం, హీటర్‌తో వాతలు పెట్టడం చేస్తూ అత్తకు ఆ కోడలు దయ్యంలా తయారయింది.
రోజుకో కొత్త పద్ధతిలో అత్తను చంపేందుకు ప్రయత్నాలు చేసింది. ఇవి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో ఆ కోడలు రాక్షసత్వం బయటపడింది. కోడలు దారుణాలు ఆ సీసీ కెమెరా ద్వారా వెలుగు చూశాయి. అంతేకాదు భర్త పైన తప్పుడు కేసు బనాయించి జైలుకు కూడా పంపించింది ఆ ఇల్లాలు.
సాధారణంగా మనం... కోడళ్లను అత్తలు బాధలు పెట్టే ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం, వింటుంటా. అత్తమామలను పెనుభారంగా పరిగణించే కోడళ్లు ముదిమి వయసులోని వారిని బయటకు గెంటేస్తున్న ఘటనలూ మనం చూస్తుంటాం.
అయితే బిజ్నూర్కు చెందిన సంగీతా దేవీ అనే ఈ కోడలు వృద్ధాప్యంలోని తన అత్తపై ప్రతాపం చూపింది. మంచంపై నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న తన అత్తను హతమార్చేందుకు యత్నించింది. అత్త పైన చాలాసార్లు దాడి చేసింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డా, ప్రాణాలతో బయటపడిన తన తల్లిని సంగీతా దేవీ భర్త ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. తన తల్లితో భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ కొడుకు తల్లి గదిలో సీసీకెమెరా ఏర్పాటు చేశాడు.
దీనిని గమనించని సంగీత తన అత్తపై ఈ నెల 5న వీరవిహారం చేసింది. తల్లిని ఆసుపత్రికి తరలించిన కొడుకు సీసీ కెమెరాలో రికార్డైన తన భార్య ప్రతాపం దృశ్యాల వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వీడియోను చూసిన పోలీసులు సంగీతా దేవిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.