వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్: తండ్రి మాత్రం కూలీగానే!

తన కొడుకును ఉన్నతస్థానంలో చూడాలని కలలు కన్న ఆ తండ్రి చివరకు తాను అనుకున్నది సాధించాడు. కూలీగా పని చేసుకుంటూ తన కొడుకును చదివించడంతో అతడు ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీలోనే సాఫ్ట్‌వేర్.

|
Google Oneindia TeluguNews

జైపూర్: తన కొడుకును ఉన్నతస్థానంలో చూడాలని కలలు కన్న ఆ తండ్రి చివరకు తాను అనుకున్నది సాధించాడు. కూలీగా పని చేసుకుంటూ తన కొడుకును చదివించడంతో అతడు ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా భారీ ప్యాకేజీతో చేరాడు. ప్రస్తుతం అతడు సియాటెల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు.

కాగా, కొడుకు పెద్ద ఉద్యోగంతో బాగానే సంపాదిస్తుండగా తానెందుకు పని చేయాలని ఆ తండ్రి అనుకోలేదు. కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నా తాను మాత్రం ఇప్పటికీ కూలి పనులకు వెళ్తూ సాధారణ జీవనం గడుపుతున్నాడు. కష్టపడేతత్వానికి అలవాటు పడ్డ తనకి కూలికి వెళ్లడంలోనే ఆనందం ఉందంటున్నాడు ఆ ఆదర్శ తండ్రి.

Working class hero: Son in Google’s Seattle office, father labourer by choice

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని సోజత్‌కు చెందిన తేజారామ్‌ రోజు కూలీ. కొడుకు రామచంద్రను కష్టపడి చదివించాడు. హిందీ మీడియం విద్యార్థి అయిన రామచంద్ర ఆంగ్ల సినిమా సబ్‌టైటిళ్లను చదువుతూ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించాడు. 70 శాతం మార్కులతో 12వ తరగతి పాసయ్యాడు. అతడిని ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని కోటాలో ఐఐటీ-జేఈఈకి కోచింగ్‌ ఇప్పించాడు ఆ తండ్రి. అందుకోసం తెలిసినవారి వారందరి దగ్గరా అప్పులు చేశాడు.

అనుకున్నట్లే ఉన్నత చదువు చదివిన రామచంద్రను అదృష్టం వరించింది. ఏకంగా గూగుల్‌లోనే ఉద్యోగం లభించింది. సియాటెల్‌లో లక్షల్లో గడిస్తున్న రామచంద్ర ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే అప్పులన్నీ తీర్చేశాడు. ఊళ్లో కొంత భూమి కూడా కొన్నాడు. ఇంటిని తల్లిదండ్రులకోసం సౌకర్యవంతంగా తీర్చిదిద్దాడు.

అయితే, తండ్రిని మాత్రం మార్చలేకపోయాడు. రోజూ కూలికి వెళ్లి రూ.100నుంచి 400 వరకు సంపాదిస్తూ ఆ మొత్తంతోనే జీవితాన్ని సాగిస్తున్నాడు అతడి తండ్రి. కూలికి వెళ్లొద్దని కొడుకు ఎంత వారించినా తనకు అందులోనే సంతోషం ఉంటుందంటున్నాడు తండ్రి. దీంతో తనకు ఏం చెప్పాలో తెలియడం లేదంటున్నాడు కొడుకు రామచంద్ర. కాగా, కొడుకును ఉన్నతుడిగా తీర్చిదిద్దిన తండ్రి.. తన తండ్రి ఇంకా కష్టపడకూడదనుకనే కొడునుకు చూసి స్థానికులు ముచ్చటపడుతున్నారు.

English summary
Tejaram Sankhla from Rajasthan’s Sojat town is no ordinary labourer. His son, 26-year-old Ram Chandra, is a Google executive at the internet giant’s Seattle office in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X