వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-పాక్ మ్యాచ్: 11 ప్రపంచకప్‌లు చూసిన వీరాభిమానికి చేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: క్రీడలకు, ముఖ్యంగా భారత క్రికెట్‌కు పెద్ద అభిమాని అయిన ఓం ప్రకాశ్ ముంద్రాను శనివారం రాత్రి కోల్‌కతాలో జరిగిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు అనుమతించలేదు. ఇప్పటి వరకు ఇతను క్రికెట్, ఫుట్‌‍బాల్ సహా ఎన్నో క్రీడలు చూసేందుకు దాదాపు 70 దేశాలు ప్రయాణించాడు.

అంతేకాదు, అతను అన్ని ఆటలను చూస్తాడు. ఫుట్‌బాల్ సహా 11 ప్రపంచకప్‌లను ప్రత్యక్షంగా వీక్షించాడు. అతను శనివారం నాగపూర్ నుంచి భారత్ - పాక్ మ్యాచ్ చూసేందుకు కోల్‌కతా వచ్చాడు. అయితే అతనిని స్థానిక పోలీసులు లోనికి పోకుండా అడ్డుకున్నారు.

ఓం ప్రకాశ్ ముంద్రాతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చారు. వారిని మాత్రం పోలీసులు లోపలకు అనుమతించలేదు. ముంద్రా, కుటుంబ సభ్యులు త్రివర్ణ పతాకంలా ఉండే దుస్తులను ధరించి వచ్చారు. వారి టర్బైన్ (తలపాగా) కూడా త్రివర్ణంలోనే ఉంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

World Twenty20: ‘No entry’ for this globetrotting sports fan

దీనిపై ముంద్రా మాట్లాడుతూ... తాను 1982 నుంచి ఎన్నో దేశాలు పర్యటించానని, ప్రపంచ కప్‌లు చూస్తున్నానని, కానీ ఇలా తనకు చేదు అనుభవం ఎదురవుతుందని భావించలేదని వ్యాఖ్యానించాడు. అయితే, వారి వస్త్రధారణ నేపథ్యంలో అనుమతించలేదని పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది.

తాను సాధారణ వ్యక్తిని అని, మ్యాచులు చూసేందుకు తాను డబ్బును కాపాడుకుంటూ జీవితం గడుపుతున్నానని, తాను ఫిఫా ప్రపంచకప్, ఒలింపిక్స్‌కు కూడా హాజరయ్యానని ఓం ప్రకాశ్ ముంద్రా చెబుతున్నారు.

English summary
Om Prakash Mundra is an exceptional Indian cricket fan. He travelled over 70 countries and attended 11 World Cups including football. On Saturday, the veteran from Nagpur — who came to Eden Gardens for the ICC World Twenty20 fixture between India and Pakistan — faced harassment from local police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X