నోట్ల రద్దు ఎఫెక్ట్ : దేవుడికే కరెన్సీ కష్టాలు, వెంకన్నకు తగ్గిన రాబడి
తిరుమల ; పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం తిరుమల దేవాలయం ఆదాయంపై పడింది.తిరుమలకు భక్తుల తాకిడికి తగ్గకపోయినా , ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా ప్రతిరోజూ సుమారు సగటున వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. భక్తుల సంఖ్య యధావిధిగా ఉన్న రాబడి మాత్రం పడిపోయింది. మరోవైపు ఈ హూండీ ఆదాయం పెరుగుతోంది.
పెద్ద నగదు నోట్ల రద్దుతో తిరుమల వెంకన్నకు కూడ కష్టాలు వచ్చిపడ్డాయి. స్వామివారి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రతిరోజూ గతంలో వచ్చినట్టుగానే భక్తుల తాకిడి దేవాలయానికి ఉంది.కాని, ఆదాయం మాత్రం పడిపోయింది.
రద్దుచేసిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకు కేంద్రం గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు గడువును ఇచ్చింది. ఈ గడువు తీరిపోయిన తర్వాత ఆదాయం మరింత తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దుతో తిరుమలలో భక్తులు కానుకలను సమర్పించేందుకుగాను ఈ హుండీ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది టిటిడి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ హూండీకి కానుకలు వస్తున్నాయి. సాధారణ హుండీకి మాత్రం కానుకలు తగ్గిపోయాయి.

వెంకన్న ఆధాయం భారీగా తగ్గింది.
ప్రతిరోజూ సాధారణ రోజుల్లో సుమారు రెండున్నర నుండి మూడు కోట్లకు పైగా ఆదాయం వస్తోంది.అయితే గత పది రోజులుగా వెంకన్న హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.గత ఏడాది డిసెంబర్ 1వ, తేతి నుండి డిసెంబర్ 31వ, తేది వరకు సుమారు 1,018 కోట్ల ఆదాయం వచ్చింది. సగటున రోజుకు సుమారు 2.78 కోట్ల ఆధాయం వచ్చినట్టు లెక్క. అయితే రద్దుచేసిన నగదు నోట్లను బ్యాంకులకు డిపాజిట్ చేసుకొనేందుకుగాను గడువు ముగిసింది.ఆ రోజునుండి హుండీ ఆదాయం తగ్గింది. జనవరి 1వ, తేదిన రూ.2.38 కోట్లు, రెండవతేదిన, 2.74 కోట్లు, మూడున రూ.1.10 కోట్లు, నాలుగవ తేదిన 1.24 కోట్లు, ఐదున రూ.1.90 కోట్లు, ఆరవతేదిన 1.72 కోట్లు, 7వ, తేదిన 2.22 కోట్లు,8వ, తేదిన3.45 కోట్లు, 9వ, తేదిన 1.45 కోట్లు , 10వ, తేదిన1.71 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది.జనవరి 8వ, తేదిన వైకుంఠ ఏకాధశి రోజున మినహయిస్తే మిగిలిన రోజుల్లో ఏ రోజూ కూడ మూడు కోట్లు మార్క్ ను దాటలేదు.

నగదు లేకపోవడం వల్లే
2016 లో మొత్తంగా 2.66 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొన్నారు. అంటే సగటున రోజుకు 72 వేల మంది వెంకన్న దర్శనానికి వచ్చారు. భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. కానీ , హుండీ కానుకలే తగ్గాయి. పెద్ద నోట్లు రద్దు కావడం, వాటిని సమకూర్చుకొనే గడువు ముగియడం , నగదును ఉపసంహరణ చేసుకొనే అవకాశాలు పరిమితం కావడంతో పాటు ప్రజల వద్ద తగినంత నగదు లేకపోవడమే ఇందుకు కారణంగా టిటిడి అధికారులు భావిస్తున్నారు.

పెరిగిన ఈ హుండీ కానుకలు
తిరుమల దేవాలయం హుండీ ఆదాయం భారీగా తగ్గింది,.అయితే పెద్ద నగదు నోట్ల రద్దుతో టిటిడి ఈ హుండీ కానుకలను ప్రోత్సహిస్తోంది.ప్రజల వద్ద పెద్దగా కొత్త కరెన్సీ లేకపోవడంతో ఈ హుండీ కానుకలను టిటిడి ప్రోత్సహిస్తోంది.2015 లో ఈ హుండీ ద్వారా రూ.6 కోట్లు ఆదాయం సమకూరగా, 2016 లో రూ.8.8 కోట్లు ఆదాయం వచ్చింది. గత నవంబర్ లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ హుండీకి రూ.కోటి ఆదాయం వచ్చింది. డిసెంబర్ లో ఈ మొత్తం రూ.2.11 కోట్లకు పెరిగింది. నవంబర్ , డిసెంబర్ నెలలో వంద శాతం మేర ఈ హుండీ కానుకలు పెరిగాయి. కాగా, మున్ముందు ఈ హుండీకి మరింత ప్రాధాన్యత పెరిగింది.

రద్దుచేసిన నగదును ఇంకా హుండీ లో చెల్లిస్తున్నారు
పెద్ద నగదు నోట్ల రద్దు గడువు ముగిసింది. పెద్ద నగదు నోట్ల రద్దు గడువు ముగిసింది.ఈ గడువు ముగిసింది. అయినా పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసినా ఇంకా రద్దు చేసిన నగదును హుండీలో చెల్లిస్తున్నారు. రద్దు చేసిన నగదు టిటిడి వద్ద సుమారు 1.6 కోట్ల రూపాయాలున్నాయి. ఈ నగదును రోజువారీ కానుకల్లో కలపడం లేదు. అయితే ఈ నగదును మార్పుకోవడం కోసం ఆర్ బి ఐ అధికారులకు లేఖలు రాసినట్టు అధికారులు చెబుతున్నారు.