వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు కన్యనా?.. కాదా?: ఉద్యోగంతో దానికి లింకు!, బీహార్ ఆసుపత్రి నిర్వాకం..

అత్యాచారాలు జరిగిన సమయంలో ఇలాంటి సమాచారం ఉపయోగపడుతుందని ఆసుపత్రి సూపరిండెంట్ పేర్కొనడం దీన్ని మరింత వివాదాస్పదం చేసింది.

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఉద్యోగంలో చేరేముందు ఆయా కంపెనీలు తప్పనిసరిగా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయమని కోరుతాయి. అందులో భాగంగా అభ్యర్థుల పూర్తి బయోడేటాను సమర్పించాల్సి ఉంటుంది. చదువు, చిరునామా, పూర్వ అనుభవం, వివాహ స్థితి వంటి ప్రశ్నలు అందులో కామన్ గా ఉంటాయి.

కానీ బీహార్ లోని ఇందిరాగాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్ యాజమాన్యం మాత్రం.. 'మీరు కన్యనా?.. కాదా?..' అన్నది కూడా చెప్పండంటూ కొత్త నిబంధన చేర్చింది. ఇదొక్కటే కాదు, మరికొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలను కూడా చేర్చి పెద్ద వివాదానికే కారణమైంది.

ఉద్యోగులకు ఇచ్చే ఫామ్స్ లో వివాహ స్థితిని ధ్రువీకరించే కాలమ్ వద్ద.. 'నేను బ్రహ్మచారిని/వితంతువు/కన్య' అని మూడు ఆప్షన్స్ ఇచ్చింది. దాంతో పాటు 'నాకు ప్రస్తుతం జీవించి ఉన్న ఒకే భార్య ఉంది'/'నాకు పెళ్లయింది, ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు'/ 'నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి జీవించి ఉన్న మరో భార్య కూడా ఉంది' వంటి విచిత్రమైన ఆప్షన్స్ ఇచ్చి అందరిచేత విమర్శలపాలవుతోంది.

Are You A Virgin? Bihar Hospital Asks Employees

పైన పేర్కొన్న ఆప్షన్స్ లో ఏదేని ఒక దానిని అభ్యర్థి టిక్ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి వివాహ స్థితిని గుర్తించడానికి సాధారణంగా అయితే.. 'సింగిల్/మ్యారీడ్' అనే రెండు ఆప్షన్స్ ను పొందుపరుస్తుంటారు. కానీ ఇందిరాగాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్ వాళ్లకు ఇలాంటి విచిత్రమైన ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు.

ఇదిలా ఉంటే, దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరిండెంట్ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఉద్యోగులు కన్యనా?.. కాదా?.. అన్న సమాచారం వారు అత్యాచారాలకు గురైన సమయాల్లో ఉపయోగపడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.

ఇక బీహార్ లో కొత్తగా కొలువుదీరిన జనతాదళ్-యునైటెడ్-భారతీయ జనతా పార్టీ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. అటు రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

English summary
A government-run hospital in Patna has asked its employees to declare their virginity in a marital status declaration form, triggering a controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X