వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై వరదల్లో ఇదో వింత: కారుపై ఎక్కి అతనేం చేశాడంటే?(వీడియో)

కారు వైపర్లు పాడైపోవడంతో ముంబైలో ఓ వాహనదారుడు అష్టకష్టాలు పడ్డాడు.చివరికి ఓ వ్యక్తి ముందుకు వచ్చి హ్యూమన్ వైపర్ లా పనిచేయడంతో కారు ముందుకు కదిలింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో ముంబైవాసులకు వరద కష్టాలు తప్పడం లేదు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో.. మోకాళ్ల లోతు నీటిలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక వాహనాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వర్షాల ధాటికి రోడ్లపై గంటలు, గంటలు ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కార్లు సైతం మునిగిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఓ వాహనాదారుడు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. భారీ వర్షానికి తోడు.. కారు వైపర్లు పాడైపోవడంతో వాహనాన్ని ముందుకు నడపకలేక అతను నానా అవస్థలు పడ్డాడు.

ఇంటికి వెళ్లలేక, కారును ముందుకు నడపకలేక చాలాసేపు అష్టకష్టాలు పడ్డాడు. ఇంతలో అతని బాధను గమనించిన ఓ వ్యక్తి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. కారు బానెట్ పైకి ఎక్కి వైపర్స్ చేయాల్సిన పని అతను చేశాడు. విండ్ షీల్డ్ ను ఓ వస్త్రంతో శుభ్రం చేస్తూ.. కారు డ్రైవర్ కు డైరెక్షన్స్ ఇచ్చాడు. దీంతో అతని డైరెక్షన్స్ ప్రకారం డ్రైవర్ కారు నడుపుకుంటూ వెళ్లాడు.

ఎవరో వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త వైరల్‌గా మారింది. చాలామంది నెటిజెన్స్ దీన్నో వింతలా చూస్తున్నారు.

English summary
Man sits on the bonnet of an Audi luxury car, wiping the windscreen and acting as spotter for the driver, who navigates the rain inundated roads of Mumbai on 29th August 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X