వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పయ్యావులతో కేసీఆర్ ఏం మాట్లాడారు, అంతకుమించి లేదా?: టిడిపిలో హాట్ టాపిక్

మంత్రి పరిటాల సునీత నయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, టిడిపి నేత పయ్యావుల కేశవ్‌లు ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్న విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: మంత్రి పరిటాల సునీత నయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, టిడిపి నేత పయ్యావుల కేశవ్‌లు ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్న విషయం తెలిసిందే.

పరిటాల శ్రీరామ్ పెళ్లికి భారీ బందోబస్తు: చంద్రబాబు-కెసిఆర్ కలవరా?పరిటాల శ్రీరామ్ పెళ్లికి భారీ బందోబస్తు: చంద్రబాబు-కెసిఆర్ కలవరా?

 టిడిపిలో హాట్ టాపిక్‌గా కెసిఆర్ - పయ్యావుల ముచ్చట్లు

టిడిపిలో హాట్ టాపిక్‌గా కెసిఆర్ - పయ్యావుల ముచ్చట్లు

ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇది టిడిపిలో హాట్ టాపిక్ అయిందని తెలుస్తోంది. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం కేసీఆర్ హెలిప్యాడ్‌‌కు బయల్దేరారు. ఇంతలో పయ్యావుల కేశవ్ ఎదురుపడ్డారు.

 పయ్యావులను పిలిచిన కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి

పయ్యావులను పిలిచిన కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి

కేసీఆర్‌కు పయ్యావుల నమస్కారం చేశారు. ప్రతి నమస్కారం చేసిన కేసీఆర్ హెలికాప్టర్ వద్దకు కదిలారు. అంతలో కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి పయ్యావుల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ పిలుస్తున్నట్టు తెలిపారు. దీంతో పయ్యావుల... కేసీఆర్ వద్దకు వెళ్లారు. వారిద్దరూ ప్రత్యేకంగా కాసేపు మాట్లాడుకున్నారు.

వ్యక్తిగత సిబ్బందిని కూడా రానివ్వలేదు

వ్యక్తిగత సిబ్బందిని కూడా రానివ్వలేదు

ఆ సమయంలో సీఎం వ్యక్తిగత సిబ్బందిని కూడా అక్కడికి రానివ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ అంతసేపు ఏం మాట్లాడుకున్నారా? అని సర్వత్రా చర్చ సాగుతోంది.

 ఏకాంత ముచ్చట్లకు ఇదే కారణమా?

ఏకాంత ముచ్చట్లకు ఇదే కారణమా?

కెసిఆర్ టిడిపిలో ఉండగా అనంతపురం ఇంచార్జ్ మంత్రిగా మూడేళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పయ్యావుల కేశవ్‌ కూడా పని చేశారు. ఆ సమయంలో ఏర్పడిన సాన్నిహిత్యంతోనే నేడు వారు మాట్లాడుకున్నారని కొందరు చెబుతున్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao alone meet with Telugu Desam Party leader Payyavula Keshav in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X