వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజర్.. ఇక్కడి నుంచి పోటీకి దిగు: కాంగ్రెస్ సూచన, సిద్దమేనంటూ బదులు..

రాష్ట్ర కాంగ్రెస్‌కు గ్లామర్ అద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ అజారుద్దీన్ ను హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయించాలనే యోచనలో ఉంది.మజ్లిస్ పార్టీ అధినేత, ప్రస్తుత ఎంపీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌కు గ్లామర్ అద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ అజారుద్దీన్ ను హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయించాలనే యోచనలో ఉంది.

మజ్లిస్ పార్టీ అధినేత, ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి దిగాలని కాంగ్రెస్ నేతలు అజహరుద్దీన్ కు సూచిస్తున్నారు. గురువారం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద సద్భావన అవార్డు అజహరుద్దీన్ కు ప్రధానం చేసిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడారు.

కాంగ్రెస్ నేతల సూచన:

కాంగ్రెస్ నేతల సూచన:


టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడారు. అజహరుద్దీన్ హైదరాబాదీ కావడంతో ఇక్కడి సమస్యల పట్ల అవగాహన ఉందని వారు అభిప్రాయపడ్డారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు.

యూపీ నుంచి

యూపీ నుంచి

అజహరుద్దీన్ గత 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ నేతలు పట్టుబడుతుండటంతో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

అవార్డు పట్ల సంతోషం:

అవార్డు పట్ల సంతోషం:

రాజీవ్ సద్భావన అవార్డు నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. ఈ వయసులో కూడా గోపాలకృష్ణ గారు చాల జోష్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఇదే జోష్ కాంగ్రెస్ పార్టీ‌లో కూడా రావాలన్నారు.

సూచనపై సానుకూలంగా:

సూచనపై సానుకూలంగా:

హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు చేసిన సూచన పట్ల అజహరుద్దీన్ సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో అందరితో కలిసి పని చేస్తానన్నారు. పార్టీకి నాసేవలు కావాలంటే నేను సిద్ధంగా ఉన్నానన్నారు.

అందరు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. కాబట్టి రానున్న ఎన్నికలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అందరు కలిసి పని చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

English summary
Congress leaders Janareddy, V.Hanumantha Rao suggested to Azaharuddin to contest from Hyderabad loksabha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X