వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జేసీ బ్రదర్స్'కేమో అలా.. మేమడిగితే ఇలానా?: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక

ప్రతీ ఎన్నికల సమయంలోను టీడీపీ తన తమ్ముడికి టికెట్ ఇస్తుందని ఆశిస్తుండటం.. తీరా ఇవ్వకపోవడంతో తమ్ముడికి నచ్చజెప్పుకోవాల్సి రావడం ఇక తనవల్ల కావట్లేదని కేఈ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం టీడీపీ నేతల్లో అసంతృప్తి గూడుకట్టుకునేలా చేసింది. టికెట్ల పంపిణీపై జిల్లా స్థాయి పార్టీ నేతలు ఇప్పటికే పెదవి విరవగా.. తాజాగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం అధినేత చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన తమ్ముడు కేఈ ప్రభాకర్ కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించలేదని కృష్ణమూర్తి సీఎంపై అలకబూనినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ ఫ్యామిలీకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి, తన తమ్ముడికి మాత్రం టికెట్ ఎందుకివ్వలేదని కేఈ వాపోతున్నట్లు సమాచారం.

Deputy cm ke krishnamurthy unhappy on mlc candidates selection

ప్రతీ ఎన్నికల సమయంలోను టీడీపీ తన తమ్ముడికి టికెట్ ఇస్తుందని ఆశిస్తుండటం.. తీరా ఇవ్వకపోవడంతో తమ్ముడికి నచ్చజెప్పుకోవాల్సి రావడం ఇక తనవల్ల కావట్లేదని కేఈ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా కర్నూలు ఎంపీ టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే జిల్లాలో టీడీపీ గెలుస్తుందని ఆయన అన్నారు. రాయలసీమలో ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించలేదని కేఈ గుర్తుచేశారు.

ఇదంతా ఇలా ఉంటే, గతంలో తన తమ్ముడు కేఈ ప్రభాకర్ పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సమయంలో కేఈ కృష్ణమూర్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ చర్యల విషయంలో అన్న, తమ్ముడు, బంధువులన్న తేడా ఉండదని అప్పట్లో ఆయన అన్నారు. అంతేకాదు, పదవులు రావాలంటే కొంత అదృష్టంతో పాటు సత్ప్రవర్తన, ఓపిక అవసరమని హితవు పలికారు.

ఇవన్ని ఉండటంతో పాటు అధినేతతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. సందర్బం వచ్చిన ప్రతీసారి అధినేత చంద్రబాబును కలుస్తూ స్థానిక సమస్యలు, అభివృద్ది కార్యక్రమాల గురించి ఆయనతో చర్చిస్తుండాలని పేర్కొన్నారు. అలాంటి నాయకులకే గుర్తింపైనా, పదవులైనా దక్కుతాయని వివరించారు.

కాగా, తమ్ముడికి సీటు కేటాయించలేదంటూ కేఈ అలకబూనిన నేపథ్యంలో పలువురు గతంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు.

English summary
AP Deputy CM KE Krishnamurthy was upset on MLC selection in party. He expressed his unhappy regarding the selection and he questioned why they were not elected his brother
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X