వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ స్టైలీష్ ‘హెయిర్’ సీక్రెట్ ఇదే!

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెయిర్‌స్టైల్‌ రహస్యం బట్టబయలైంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెయిర్‌స్టైల్‌ రహస్యం బట్టబయలైంది. ఏడు పదుల వయసులోనూ జుట్టు వూడిపోకుండా ఉండేందుకు ట్రంప్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆయన వ్యక్తిగత వైద్యుడు డా హరాల్డ్‌ బార్న్‌స్టెయిన్‌ బయటపెట్టారు.

ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామంతో పాటు జుట్టును కాపాడుకునేందుకు ట్రంప్.. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని వెల్లడించారు. జుట్టు పెరుగుదల కోసం ప్రోస్టేట్‌ సంబంధిత డ్రగ్‌ను తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

Donald Trump’s doctor reveals secret to president’s hair

సాధారణంగా శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ డీహెచ్‌టీ(డై హైడ్రో టెస్టోస్టిరాన్‌)గా మారుతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకుండా డీహెచ్‌టీ అడ్డుపడుతుంది. దీంతో ఎక్కువగా పురుషుల్లో జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుంది. అందుకే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ 'డీహెచ్‌టీ'గా మారకుండా నిలువరించే డ్రగ్‌ను ట్రంప్‌ తీసుకుంటారని వైద్యుడు హరాల్డ్ వివరించారు.

అదేవిధంగా చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా యాంటీ బయాటిక్‌ మందులను తీసుకుంటారట ట్రంప్. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచేందుకు మందులు వాడతారట. కాగా, డాక్టర్ హరాల్డ్ గత 36ఏళ్ల నుంచీ డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత వైద్యుడిగా పనిచేస్తున్నారు.

English summary
US president Donald Trump takes a prostate drug marketed to promote hair growth, the 70-year-old billionaire’s long-time physician revealed in a series of wide-ranging interviews published by The New York Times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X