వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు అమెరికా టూర్‌పై జగన్ పార్టీ పక్కా ప్లాన్‌తో..?: ఎవరో తెలిసిందంటూ..!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అమెరికాలో టార్గెట్ చేసింది ఎవరో తెలిసిపోయిందంటున్నారు. అంతకుముందు ఓ వెబ్‌సైట్ చంద్రబాబు అమెరికా పర్యటనపై కథనాలు రాసింది. ఆ కథనంలో ఉన్నట్లుగానే ఇర్విన్ మేయర్‌కు ఇచ్చిన

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అమెరికాలో టార్గెట్ చేసింది ఎవరో తెలిసిపోయిందంటున్నారు. అంతకుముందు ఓ వెబ్‌సైట్ చంద్రబాబు అమెరికా పర్యటనపై కథనాలు రాసింది. ఆ కథనంలో ఉన్నట్లుగానే ఇర్విన్ మేయర్‌కు ఇచ్చిన ఫిర్యాదులోను ఉందంటున్నారు.

అమెరికాలో బాబుపై ఫిర్యాదులో కొత్త ట్విస్ట్: 'టిడిపిలో గ్రూపుల వల్లే' అమెరికాలో బాబుపై ఫిర్యాదులో కొత్త ట్విస్ట్: 'టిడిపిలో గ్రూపుల వల్లే'

చంద్రబాబు పర్యటన ప్రారంభం కాకముందు నుంచే ఓ పద్ధతి ప్రకారం సోషల్‌ మీడియా ద్వారా పన్నాగం అమలు చేయడం ప్రారంభించారని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వైసిపి సోషల్ మీడియా విభాగంలోని వ్యక్తుల పేర్లతో పొలిటికల్ పంచ్‌‌లా వందల కొద్దీ ఫేస్‌బుక్ పేజీలతో పాటు వాటికి అనుబంధంగా వెబ్‌సైట్ నిర్వహిస్తుంటారని చెబుతున్నారు. అలాంటి వాటిలో ఓ వెబ్ సైట్లో పెట్టిన పోస్టులు చంద్రబాబు, లోకేష్, టీడీపీని టార్గెట్ చేస్తూనే ఉంటాయి.

ముందే వెబ్‌సైట్లో కథనాలు

ముందే వెబ్‌సైట్లో కథనాలు

ఇది వైసీపీకి సంబంధించిందేనని, ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని టిడిపి నేతలు చెబుతున్నారు. ముఖ్యమంగా చంద్రబాబు అమెరికా పర్యటన ప్రారంభం కాకముందే వెబ్‌సైట్లో వచ్చిన కథనంలో ఏ అంశాలున్నాయో అవే అంశాలు ఇర్వింగ్ మేయర్‌కు పంపిన మెయిల్‌లో ఉన్నాయంటున్నారు.

చంద్రబాబుపై విద్వేషపూరిత వ్యాఖ్యలు

చంద్రబాబుపై విద్వేషపూరిత వ్యాఖ్యలు

చంద్రబాబు విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తారని ఆ లేఖలో ఉంది. ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయుల్ని సంఘటితం చేయడం, పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్లేందుకు కుట్ర పన్నుతున్నారని ఈ మెయిల్‌లో ఆరోపించారు. వీటన్నింటికి లోటస్‌పాండ్ నుంచే కుట్ర జరిగిందనేది టిడిపి ఆరోపణ.

హైదరాబాద్ నుంచి ఎన్నారైల పేరుతో ఈ మెయిల్ వెళ్లిందని దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బయటకు తీస్తున్నామని తెలుగుదేశం పార్టీ వారు చెబుతున్నారు.

వారే చేసి ఉంటే...

వారే చేసి ఉంటే...

నిజంగానే మానవహక్కుల సంస్థే ఈ ఫిర్యాదు చేసి ఉంటే బహిరంగంగా ప్రకటించుకుంటుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. చంద్రబాబు పర్యటనను గందరగోళంలో పడేసే ప్లాన్‌లో బాగంగా ఎన్నారై వైసీపీ విభాగం దిశానిర్దేశం చేసేందుకు జగన్ పత్రికలో అత్యున్నత పదవిలో ఉండి, ప్రస్తుతం జగన్‌కు సన్నిహితంగా ఉన్న ఓ నేతను అమెరికాకు పంపినట్లుగా కూడా అనుమానిస్తున్నారు.

ద్రబాబు పర్యటన ముగిసే వరకు..

ద్రబాబు పర్యటన ముగిసే వరకు..

చంద్రబాబు పర్యటన ముగిసే వరకు అతను అక్కడే మకాం ఉండేటట్లు ఏర్పాట్లు జరిగినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటనపై అధికార ప్రకటన విడుదలైన తర్వాతే వ్యూహం అమలుపై భేటీ జరిగిందని కథనాలు వస్తున్నాయి. జగన్ కూడా ఎన్నారైలతో మాట్లాడారంటున్నారు.

తెరపైకి కొత్త అంశం

తెరపైకి కొత్త అంశం

అమెరికాలో బాబుపై ఫిర్యాదు నేపథ్యంలో టిడిపి.. వైసిపిని టార్గెట్ చేసింది. దీంతో టిడిపిలోని రెండు వర్గాల పోరాటం అంటూ వైసిపి కౌంటర్ ఇచ్చే అంశాన్ని ముందుకు తెచ్చిందని టిడిపి నేతలు అంటున్నారు. కాగా, చంద్రబాబును టార్గెట్ చేసిన వారిలో ఆరుగురిని గుర్తించినట్లుగా టిడిపి చెబుతోంది. ఆ ఆరుగురి ద్వారా కూపీలాగనున్నారని తెలుస్తోంది.

English summary
Email to US Mayor demands arrest of Andhra CM Naidu, TDP blames YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X