వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత అనుభవం: 2017లో టేకాఫ్ అయిన విమానం 2016లో ల్యాండైంది!

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణికులు వింత అనుభూతిని పొందారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/బీజింగ్: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణికులు వింత అనుభూతిని పొందారు. కొత్త ఏడాది సందర్భంగా తాము ప్రయాణించిన విమానం 2017లో బయలుదేరి చేరుకోవాల్సిన ప్రదేశాన్ని 2016లో చేరిందని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుభూతి తమను ఎంతో థ్రిల్‌కు గురిచేసిందని వారంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం యూఏ890 (బోయింగ్ 787-909) విమానం 2017 జనవరి 1వ తేదీన వేకువజామున చైనాలోని షాంఘైలో బయలుదేరింది.
ఆ బోయింగ్ విమానం 2016 డిసెంబర్ 31న రాత్రి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంది. దీంతో విమాన ప్రయాణికులందరూ సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

Flight leaves China in 2017, lands in San Francisco in 2016

అయితే, ఇది ఎలా సాధ్యమంటే.. ఈ రెండు ప్రాంతాల మధ్య టైమ్ వ్యత్యాసం దాదాపు 16 గంటలు. శాంఘై నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లడానికి దాదాపు 11 గంటల 5 నిమిషాలు పడుతుంది. టైమ్ వ్యత్యాసం గమనించినట్లయితే ఇది సాధ్యపడుతుందని చెప్పవచ్చు.

ఇంకా చెప్పాలంటే.. షాంఘైలో 2017 జనవరి 1న టైమ్ మధ్యాహ్నం 12 గంటలు అనుకుంటే.. సరిగ్గా అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో టైమ్ 2016 డిసెంబర్ 31 రాత్రి 8 గంటలు ఉంటుంది. అందువల్లే 2017లో బయల్దేరిన విమానం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారి విపరీతంగా షేర్ అవుతోంది. ఏలో చేరడం సాధ్యమైంది.

English summary
United Airlines has figured out the secret to time travel. A flight that departed in Shanghai in 2017, will arrive in San Francisco in 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X