వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఓకేపై ఘోర తప్పిదం: 'కాంగ్రెస్ పాకిస్తాన్‌పై ప్రేమ చూపుతోందా?'

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విడుదల చేసిన ఓ బుక్‌లెట్ వివాదాస్పదమయింది. జమ్ము కాశ్మీర్‌లోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆ బుక్‌లెట్‌లో భారత ఆక్రమిత కాశ్మీర్‌గా చూపించి, ఘోర తప్పిదం

|
Google Oneindia TeluguNews

కాశ్మీర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విడుదల చేసిన ఓ బుక్‌లెట్ వివాదాస్పదమయింది. జమ్ము కాశ్మీర్‌లోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆ బుక్‌లెట్‌లో భారత ఆక్రమిత కాశ్మీర్‌గా చూపించి, ఘోర తప్పిదం చేశారు.

<strong>భారత గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా హెలికాప్టర్</strong>భారత గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా హెలికాప్టర్

గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. బుక్‌లెట్ తీవ్ర దుమారం రేపింది. అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి. కాంగ్రెస్ ఘోర తప్పిదంపై తక్షణం స్పందించిన బిజెపి విరుచుకుపడింది. పాకిస్థాన్‌పై తనకున్న ప్రేమను కాంగ్రెస్ ఇలా చాటుకుందని విమర్శించింది.

చేసిన తప్పును గ్రహించిన కాంగ్రెస్ వెంటనే క్షమాపణలు తెలిపింది. ఆ బుక్‌లెట్‌ను విడుదల చేయబోమని తేల్చి చెప్పింది. ఆజాద్ లాంటి సీనియర్ నేత ఇలా చేయడం సరికాదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పాకిస్థాన్ పక్షాన మాట్లాడుతోందా? అని ప్రశ్నించారు.జరిగిన తప్పిదంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. మ్యాప్ ఘటనపై కాంగ్రెస్‌ నేతలు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
The Congress party committed a blooper when its senior leader Ghulam Nabi Azad released a booklet with a map of Jammu and Kashmir shown as Indian occupied Kashmir, drawing stinging criticism from the ruling BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X