వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠ్యాంశంలో 'మహిళల శరీర కొలతలు': '36–24–36'పై రేగుతోన్న వివాదం..

విశ్వ సుందరి కిరీటం పొందాలనుకునే అందాల పోటీల్లో మహిళల శరీర కొలతలకు '36-24-36'నే ప్రామాణికంగా తీసుకుంటారని పాఠ్యాంశంలో పొందుపరిచారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విద్యార్థులు చదువుకునే పాఠ్యాంశాల్లో వివక్ష లేదా అనైతికతకు తావిచ్చే అంశాలను ఎంత దూరం పెడితే అంత మంచిది. కానీ పరిస్థితి చూస్తుంటే.. ఈ మధ్య కాలంలో పాఠ్యాంశాల సిలబస్ లో పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

తాజాగా సీబీఎస్ఈ 12వ తరగతి పాఠ్యాంశంలో మహిళల శరీర సౌష్టవాన్ని తెలిపే కొలతలు ప్రత్యక్షమవడం వివాదస్పదంగా మారింది. డాక్టర్ వీకె శర్మ రచించిన హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పుస్తకంలోని సైకాలజీ అండ్ స్పోర్ట్స్ చాప్టర్ లో మహిళల శరీర కొలతలకు సంబంధించిన అంశాలు పేర్కొన్నారు.

Guess What Class XII CBSE Students Are Being Taught About The Ideal 'Female Shape'?

విశ్వ సుందరి కిరీటం పొందాలనుకునే అందాల పోటీల్లో మహిళల శరీర కొలతలకు '36-24-36'నే ప్రామాణికంగా తీసుకుంటారని పాఠ్యాంశంలో పొందుపరిచారు. దీనికి సంబంధించిన రాతలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేయడంతో దీనిపై వివాదం రేగింది. దీంతో తక్షణం పుస్తకంలో ఆ పాఠ్యాంశం లేకుండా తొలగించేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కాగా, దీనిపై సీబీఎస్ఈ వివరణ ఇచ్చుకుంది. ప్రైవేటు, పబ్లిషర్స్ పుస్తకాలను తమ పాఠశాలల్లో బోధనకు అనుమతించట్లేదని సీబీఎస్ఈ తెలిపింది.

English summary
Forget everything you've been reading about body types and those international campaigns that insist on telling you that beauty is only skin-deep, and that all bodies, colours and genders are beautiful
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X