వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదొక్కటే!, మరో మార్గం లేదు.. యుద్ద పిపాసికి అదే గుణపాఠం: 'కిమ్'పై అమెరికా, చైనా మాత్రం!

కిమ్ లాంటి యుద్దపిపాసిని అడ్డుకోవాలంటే తీవ్ర చర్యలకు సిద్దపడటం తప్ప మరో దారి లేదన్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

US Envoy Nikki Haley over North Korea కిమ్ జాంగ్ కు యుద్దం ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు

న్యూయార్క్: ఎంతసేపు తన ఆర్థిక లావాదేవీలను చక్కదిద్దుకునే కోణంలోనే ఆలోచిస్తున్న చైనా.. ఉత్తరకొరియా వల్ల ప్రపంచానికి వాటిల్లే ముప్పును మాత్రం అంత తీవ్రంగా పరిగణించడం లేదు. ఉత్తరకొరియా అణ్వాయుధాల వల్ల ఏమైనా జరగనివ్వండి కానీ.. తమ వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలు ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదించబోమని తెగేసి చెబుతోంది.

చైనా తీరుపై ఐరాస సహా అమెరికా, సహా ఉత్తరకొరియా పొరుగు దేశాలు కూడా గుర్రుగా ఉన్నాయి. మిత్ర దేశాన్ని నియంత్రించాల్సింది పోయి వారి దుశ్చర్యలకు వంత పాడటం వారికి మింగుడుపడటం లేదు. ఐరాసలో ఉత్తరకొరియా-అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర పరిణామాలపై చర్చ జరగ్గా.. చైనా ఎంతసేపు కిమ్ జాంగ్ ను వెనుకేసుకురావడంతోనే సరిపోయింది.

ఓపిక లేదన్న నిక్కీ హేలీ:

ఓపిక లేదన్న నిక్కీ హేలీ:

ఉత్తరకొరియా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే 9సార్లు చర్చించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి.. సోమవారం మరోసారి భేటీ అయింది. సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఉత్తరకొరియా తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

కిమ్ జాంగ్ కు యుద్దం ఆలోచన తప్ప మరో ఆలోచన లేదని, ఐరాస ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఆ దేశం తీరులో మాత్రం మార్పు రావడం లేదని హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 6సార్లు అణు ప్రయోగాలు చేసిన కిమ్ ను ఇక దారికి తీసుకురావాలనే ఆలోచన వీడుదామంటూ సలహా ఇచ్చారు. తీవ్ర చర్యలతో ప్రతిఘటిస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయం వెలిబుచ్చారు.

అమెరికా పైకి వందల బాంబులు:

అమెరికా పైకి వందల బాంబులు:

ఉత్తరకొరియా విషయంలో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారి ఆలోచించాలని, అమెరికా పైకి, అమెరికన్ల పైకి వందల బాంబులు గురిపెట్టిన ఆ దేశాన్ని ఇంకా మాటలతో బుజ్జగించడం సరికాదని హేలీ అన్నారు. యుద్దం మా వాంఛ కాదని చెబుతూనే.. భద్రత విషయంలో ఎంత దూరమైన వెళ్తామని ఆమె స్పష్టం చేశారు.

తీరు మారని చైనా, అమెరికా ద్వంద్వ నీతి:

తీరు మారని చైనా, అమెరికా ద్వంద్వ నీతి:

అమెరికా ఒత్తిడితో ఉత్తరకొరియాకు ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనాపై ఐరాస ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలను తోసిపుచ్చుతూ తమకే ఆర్థిక కార్యకలాపాలే ముఖ్యం అన్న తీరులో చైనా మాట్లాడుతోంది. తాజా ఐరాస భద్రతా మండలి సదస్సులోను ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

ఉత్తరకొరియాపై తీవ్ర చర్యలకు సిద్దమవుదామన్న నిక్కీ హేలీ వాదనను చైనా ప్రతినిధి లూజీ ఖండించారు. అదే సమయంలో అమెరికా ద్వంద్వ నీతిని సైతం ఆయన ఎండగట్టారు. అణ్వాయుధాలు వదులుకోవాలని ఉత్తరకొరియాకు సలహాలిస్తున్న అమెరికా.. తనకు తానుగా ఆ పనిచేస్తోందా? అని ప్రశ్నించారు.

ముందు మీరు తగ్గండి?:

ముందు మీరు తగ్గండి?:

ఉత్తరకొరియాతో తమకు ధృఢమైన వాణిజ్య సంబంధాలున్న నేపథ్యంలో.. వాటిని వదులుకోవడానికి తాము సిద్దంగా లేమని చైనా కుండబద్దలు కొట్టింది. విదేశీ వాణిజ్యం విషయంలో ఉత్తరకొరియా చైనా మీదే 90శాతం ఆధారపడుతోంది. దీంతో ఇది తమ ఆర్థిక ఉనికిని దెబ్బ తీస్తుందనేది చైనా వాదన.

కొరియాపై ఆంక్షలను కఠినతరం చేయాలన్న ఆలోచనలను చైనా, రష్యా ఎంతమాత్రం సహించబోవని లూజీ తెలిపారు. కొరియా ద్వీపంలో శాంతి నెలకొనాలంటే ముందు దక్షిణ కొరియా, అమెరికా, దాని అనుబంధ దేశాలు వెనక్కి తగ్గాలని లూజీ సూచించారు.

యుద్దపిపాసిని అడ్డుకోవడానికి:

యుద్దపిపాసిని అడ్డుకోవడానికి:

ఐరాసా ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తోన్న చైనా.. పరోక్షంగా కిమ్‌ తయారుచేస్తోన్న మిస్సైళ్లకు నిధులు ఇస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఉత్తరకొరియా విషయంలో చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయని, ఇప్పటికీ 10సార్లు హెచ్చరించినా ఆ దేశం వినే పరిస్థితిలో లేదని వాదిస్తోంది. కిమ్ లాంటి యుద్దపిపాసిని అడ్డుకోవాలంటే తీవ్ర చర్యలకు సిద్దపడటం తప్ప మరో దారి లేదని, కిమ్ సైతం యుద్దం చేయాల్సిందిగా వేడుకుంటున్నాడని అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు.

English summary
US Ambassador to the United Nations Nikki Haley said Monday that North Korean leader Kim Jong Un was "begging for war" as she urged the UN Security Council to adopt the strongest sanctions measures possible to stop Pyongyang's nuclear program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X