వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు: డోక్లాం పరిష్కారం వెనుక దోవల్ చతురత, ఇలా ముగించేశారు!

నెల రోజులకు పైగా భారత్-చైనా మధ్య కొనసాగిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. బ్రిక్స్ సమావేశం నేపథ్యంలోనే చైనా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నెల రోజులకు పైగా భారత్-చైనా మధ్య కొనసాగిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. బ్రిక్స్ సమావేశం నేపథ్యంలోనే చైనా ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తున్నప్పటికీ.. భారత జాతీయ భద్రతా సలహాదారు దౌత్యం కూడా బాగానే పనిచేసినట్లు చెబుతున్నారు.

చైనాను ఎదుర్కొనేందుకు తామెంత ధీటుగా ఉన్నామో, దానివల్ల ఎంతటి నష్టం జరుగుతుందో చెబుతూనే దౌత్య చర్చలను అజిత్ దోవల్ బృందం ముందుకు తీసుకెళ్లింది. గత జులై 27న బీజింగ్‌లో చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచితో దోవల్ తొలిసారిగా చర్చలు జరిపారు.

చైనా ఎందుకు తోక ముడిచింది?: నిజాలివే.. డోక్లాం ప్రతిష్టంభనపై మోడీ అలా చేస్తారనే?చైనా ఎందుకు తోక ముడిచింది?: నిజాలివే.. డోక్లాం ప్రతిష్టంభనపై మోడీ అలా చేస్తారనే?

ధీటుగా బదులిచ్చిన దోవల్:

ధీటుగా బదులిచ్చిన దోవల్:

ఈ సందర్భంగా యాంగ్-దోవల్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇది మీ భూభాగమా? అంటూ యాంగ్ వేసిన ప్రశ్నకు.. 'ప్రతి వివాదాస్పద ప్రాంతం చైనాకే చెందుతుందా?' అంటూ దోవల్ ధీటుగా బదులిచ్చారు. భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ విషయం గుర్తుచేసి:

ఆ విషయం గుర్తుచేసి:

భూటాన్-భారత్‌ల మధ్య ఉన్న చారిత్రక ఒప్పందాలకు చైనా తూట్లు పొడించిందని, ఆ ఒప్పందాల మేరకు భూటాన్ భద్రతను కాపాడాల్సిన అవసరం భారత్ కు ఉందని గుర్తుచేశారు. అటు చైనా మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించైనా సరే.. డోక్లాంలో తాము తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే భావనలో ఉంది.

మరో మాట లేకుండా తిరస్కరించి:

మరో మాట లేకుండా తిరస్కరించి:

డోక్లాంకు బదులుగా 500చదరపు కిలోమీటర్ల భూటాన్ భూభాగాన్ని ఇస్తామని భారత్‌కు చైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆఫర్ చేసింది.చైనా చేసిన ఈ ప్రతిపాదనను భారత్ మరో మాట లేకుండా తిరస్కరించింది. భారత విదేశాంగ కార్యదర్శి భూభాగాన్ని ఎస్ జై శంకర్, చైనాలోని భారత రాయబారి విజయ్ గోఖలే, ఆర్మీ చీఫ్ రావత్, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అనిల్ భట్ తదితరులు చైనా బృందంతో చర్చలు జరిపినవారిలో ఉన్నారు.

దోవల్ బృందం సక్సెస్:

దోవల్ బృందం సక్సెస్:

సమస్య పరిష్కారం పట్ల భారత్ చూపించిన చొరవ కూడా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేసింది. చైనా మీడియా అత్యుత్సాహన్ని పట్టించుకోకుండా.. దీనిపై నేరుగా చర్చలు జరపడం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఆ ఉద్దేశంతోనే దోవల్ బృందాన్ని చైనాకు పంపించింది. భారత్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దోవల్ ఆ విషయంలో విజయం సాధించారు.

English summary
As Doklam stand-off escalated between India and China, national security adviser (NSA) A K Doval and his team quietly met their Chinese counterpart in an attempt to defuse the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X