వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరస్వతి చేతిలో గన్ పెట్టిన వర్మ: ఏపీ 'మ్యాప్'ను ఇలా పోలుస్తూ..

'ఈ మ్యాప్ గన్ లా కనిపిస్తుందా? మరోలా కనిపిస్తుందా? అన్నది పాయింట్ కాదు. ఇది దేన్ని షూట్ చేయబోతుంది? దాని ఫలితం ఎలా ఉండబోతుంది అన్నదే మెయిన్ పాయింట్'

|
Google Oneindia TeluguNews

ముంబై: వివాదాలతో సహవాసం చేసే రామ్ గోపాల్ వర్మ.. ఈమధ్య కాలంలో ట్విట్టర్ ద్వారా అటు మీడియాకు ఇటు జనానికి వీలైనంత మసాలా చర్చను అందిస్తున్నారు. పైత్యం అనుకున్నా సరే.. పనికిమాలిన వ్యాఖ్యలనుకున్నా సరే.. తాను మాత్రం తనకు నచ్చింది.. తనకు అనిపించింది ట్వీట్ చేస్తూనే ఉన్నాడు.

ఎప్పుడూ వ్యక్తులు.. సెలబ్రిటీలనే ఎక్కువగా టార్గెట్ చేసే వర్మ.. ఈసారి తన ట్వీట్లను ఏపీ మ్యాప్ పైకి ఎక్కుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను 'గన్'తో పేల్చి మరోసారి తన ఐడీయాలజీని చాటుకున్నాడు. అలాగే లక్ష్మీదేవి చేతిలోను వీణకు బదులుగా.. ఏపీ మ్యాప్ ను పెట్టి.. 'గన్' పెట్టుకున్న లక్ష్మీదేవియే ఎక్కువగా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.

'ఈ మ్యాప్ గన్ లా కనిపిస్తుందా? మరోలా కనిపిస్తుందా? అన్నది పాయింట్ కాదు. ఇది దేన్ని షూట్ చేయబోతుంది? దాని ఫలితం ఎలా ఉండబోతుంది అన్నదే మెయిన్ పాయింట్' అంటూ మరో ట్వీట్ లో వర్మ స్పందించాడు. కొసమెరుపు ఏంటంటే.. ఈ ట్వీట్ చివరన 'సస్యశ్యామలం' అంటూ వర్మ ట్వీట్ చేయడం గమనార్హం.

మరో ట్వీట్‌లో.. 'ఏపీ మ్యాప్ ఇలా గన్‌లా నిలబడి ఉండటం నాకు చాలా నచ్చింది. అది తన లక్ష్యాన్ని ఎక్కుపెట్టింది. వేర్వేరు లక్ష్యాలను ఎక్కుపెట్టడానికి మందుగుండు కూడ సిద్దంగా ఉంది' అంటూ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు.

English summary
I luv it that AP is standing up like a gun nd pointing straight to its objective nd it has ammunition of various kinds purposes to shoot, Its varmas latest tweet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X