వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం!

ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం జరిగింది. సీనియర్ మంత్రి అయినప్పటికీ, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఎగురవేసే అవకాశం లేకుండా పోయింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం జరిగింది. సీనియర్ మంత్రి అయినప్పటికీ, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఎగురవేసే అవకాశం లేకుండా పోయింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఏ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా లేరు.

జగన్ వ్యాఖ్యలు, చంద్రబాబు భావోద్వేగంజగన్ వ్యాఖ్యలు, చంద్రబాబు భావోద్వేగం

KE Krishna Murthy is not in flag hausting ministers list

దీంతో అధికారికంగా జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేసే అవకాశం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా కేఈ కృష్ణమూర్తి సొంత జిల్లా కర్నూలులో మంత్రి కాల్వ శ్రీనివాసులు జెండా ఎగురవేస్తారు.

మంత్రివర్గంలో సీనియర్ అయినప్పటికీ, ఆయనను ఏ జిల్లాకు ఇంచార్జిగా నియమించకపోవడం గమనార్హం. గతంలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ అధికారాలను సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేయడం తెలిసిందే. రెవెన్యూ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో కూడా ఆయనకు స్థానం కల్పించలేదు.

English summary
Telugu Desam Party leader and Deputy Chief Minister KE Krishna Murthy is not in flag hausting ministers list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X