విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశినేని ఎఫెక్ట్: నారా లోకేష్ అవమానించారా? టిడిపి దౌర్జన్యం అంటూ

తమకు న్యాయం చేయాలని కోరిన కేశినేని నాని ట్రావెల్స్ కార్మికలతో మాట్లాడకుండా మంత్రి నారా లోకేష్ అవమానించి పంపించారని వార్తలు వస్తున్నాయి. వారితో కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదంటున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తమకు న్యాయం చేయాలని కోరిన కేశినేని నాని ట్రావెల్స్ కార్మికలతో మాట్లాడకుండా మంత్రి నారా లోకేష్ అవమానించి పంపించారని వార్తలు వస్తున్నాయి. వారితో కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదంటున్నారు.

అంతేకాకుండా కార్మికులపై టిడిపి కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, అంతు చూస్తామని హెచ్చరించారని ప్రచారం సాగుతోంది. మంగళవారం కేశినేని ట్రావెల్స్‌ యజమాని, టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుందట.

ప్రత్యామ్నాయం చూపించకుండా..

ప్రత్యామ్నాయం చూపించకుండా..

కేశినేని నాని అర్ధాంతరంగా తన ట్రావెల్స్‌ను మూసివేశారు. అప్పటికే దాదాపు ఏడాదిగా కార్మికులకు జీతాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించకుండా సంస్థను మూసివేశారు. దాదాపు 400 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డారు. జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులు ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది.

స్పందన లేదు

స్పందన లేదు

లేఖలు, సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందన లేదు. మంత్రి లోకేశ్‌ విజయవాడ లోకసభ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న కార్మికులు అక్కడికి వెళ్లి, మంత్రి లోకేశ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని భావించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు మంగళవారం ఉదయమే ఎంపీ కేశినేని నాని కార్యాలయానికి చేరుకున్నారు.

పరాభవం

పరాభవం

అయితే, లోకేశ్‌ను కలిసేందుకు ప్రయత్నించిన కార్మికులకు పరాభవం ఎదురయిందని అంటున్నారు. కార్యాలయం గేటు వద్దే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంతగా అడిగిన లోనికి వెళ్లనివ్వలేదని, తమలో కొందరు వెళ్లి వినతిపత్రం ఇచ్చి వస్తామని చెప్పినా వినిపించుకోలేదని, అంతలోనే అక్కడకు టిడిపి కార్యకర్తలు వచ్చి కార్మికులను తీవ్రంగా దుర్భాషలాడారని అంటున్నారు. కొందరిని నెట్టి వేశారని చెబుతున్నారు.

తోపులాట

తోపులాట

ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కార్మికులు నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది. ఆ తర్వాత పోలీసులు కార్మికులకు అతికష్టం మీద సర్దిచెప్పి పంపించారు. న్యాయం కోసం మంత్రి లోకేశ్‌ను కలుద్దామని వెళ్తే తమపై దౌర్జన్యం చేయించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Kesineni Travels workers fire at AP Minister Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X