• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: పిల్లాడి రక్తం తాగి.. తొడ కండరం తిని... గుండెను విసిరేశాడు

By Ramesh Babu
|

లుథియానా: తొమ్మిదేళ్ళ చిన్నారిని అత్యంత భయానకంగా, క్రూరంగా పదహారేళ్ళ టీనేజర్ హతమార్చాడు. అంతటితో ఊరుకోకుండా.. ఆ పిల్లాడి రక్తం తాగి, తొడ కండరాన్ని తిని, గుండెను పెకిలించి విసిరేశాడు.

వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్ లుథియానా లోని డుగ్రీ ప్రాంతంలో కర్నైల్ సింగ్ నగర్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

దూరపు బంధువు, ఇంటి పక్కనే ఉండే దీపు అనే బాలుడిని మంగళవారం హత్య చేశాడు. అనంతరం ఆ పిల్లాడి రక్తం తాగి, తొడ కండరం కోసి తిన్నాడు. దీపు మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు.

Ludhiana murder: Police say teen killed 9-year-old boy, drank his blood, ate his flesh

ఆ ముక్కలను బాత్రూంలో శుభ్రం చేసి, తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. దీపు మృతదేహం నుంచి గుండెను తొలగించి సమీపంలోని స్కూల్ కాంపౌండ్ లోకి విసిరేశాడు. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దీపు మృతదేహపు భాగాలను, గుండెను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా పోలీసులు నిందితుడైన 16 ఏళ్ల టీనేజర్ ను శుక్రవారం అరెస్ట్ చేసి, విచారించగా.. అతడు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. కుటుంబ సభ్యులు లేని సమయం చూసుకుని దీపును కత్తితో పొడిచి చంపినట్లు అంగీకరించాడు.

ఈ కేసు విచారణలో అతడు చెప్పిన వివరాలు విని పోలీసులే షాకయ్యారు. స్కూలుకు వెళ్ళడం తనకు ఇష్టం లేదని, స్కూలుకు చెడ్డపేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో దీపు గుండెను స్కూల్లోకి విసిరేసినట్లు చెప్పాడు.

అయితే, దీపును కిడ్నాప్ చేశానని చెప్పి బెదిరించి అతడి కుటుబం నుంచి డబ్బు డిమాండ్ చేయాలని నిందితుడు భావించాడని, కానీ తర్వాత తన పథకాన్ని విరమించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

నిందితులు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, నరమాంసం తినేందుకు క్రూరంగా ప్రవర్తిస్తాడని వారు తెలిపారు. కొన్నిసార్లు అతడు తన చేతులను కూడా కొరుక్కునే వాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police on Friday arrested a teenaged boy, a student of Class 8, for the cold-blooded murder of nine-year-old Deepu in Karnail Singh Nagar of Dugri area here. As per the police, the accused has confessed that he killed the boy on Tuesday to eat victim’s flesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more