వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతి రహస్యం వెలుగు చూసింది: ఏమిటి?

మాయావతి ధారాళంగా మాట్లాడినట్లు కనిపిస్తారు. ఆమె అలా మాట్లాడడానికి ఓ కారణం ఉంది. ఆ రహస్యాన్ని ఆమె విప్పి చెప్పారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) చీఫ్ మాయావతికి సంబంధించిన రహస్యం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఆమె ముందుగా రాసుకున్న ప్రసంగ పాఠాలను మాత్రమే చదువుతారు, విడిగా మాట్లాడారు. ఈ విషయం శుక్రవారంనాడు వెలుగు చూసింది. ఆ విషయం ఆమె నోటి వెంటనే వెలువడింది.

తన తమ్ముడు ఆనంద కుమార్‌ను ఆమె శుక్రవారంనాడు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్బంలో ఆమె తొలిసారి తన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలకు చెప్పారు. ముందుగా రాసుకున్న ప్రసంగ పాఠాలను తాను ఎందుకు చదవాల్సి వస్తుందో ఆమె చెప్పారు.

Mayawati reveals why she reads only written speeches

తాను 1996లో ఓ గ్రంథిని కోల్పోయానని, గొంతులోని రెండు గ్రంథుల్లో ఒకదాన్ని వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారని, అందువల్ల గొంతుపై ఎక్కువ ఒత్తిడి పెట్టలేనని ఆమె చెప్పారు. ముందుగా రాసి సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠాలను మాత్రమే చదవాలని తనకు వైద్యులు సలహా ఇచ్చినట్లు కూడా ఆమె తెలిపారు.

ప్రసంగ పాఠాన్ని రాసుకోవడానికి ముందుగా తాను చాలా శ్రమిస్తానని, తర్వాత దాన్ని మాట్లాడుతానని ఆమె చెప్పారు. ఈవిఎంల ట్యాంపరింగ్ అంశాన్ని లేవనెత్తినందుకు బిజెపి తనను లక్ష్యంగా చేసుకుందని ఆమె విమర్శించారు.

English summary
Bahujan Samaj Party (BSP) chief Mayawati, who on Friday appointed her younger brother Anand Kumar as the party's national vice president, has revealed why she reads only written speeches and does not speak extempore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X