మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ కుడిభుజమంటే హడల్ మరి? యధేచ్ఛగా గిరిజన భూ కబ్జా

లావణ్యారెడ్డి మెదక్ జడ్పీటీసీ సభ్యురాలు.. తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి కుడిభుజం. ఆమె అంటే అధికారులకు హడల్.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ మెదక్: దేవుడు దయ తలిచినా పూజారి కనికరించాలి.. సర్కార్ 50 ఏళ్ల క్రితమే పాస్ పుస్తకాలు పంపిణీ చేసినా ఒక మహిళా ప్రజాప్రతినిధి బెదిరింపులకు పాల్పడుతూ నిరుపేద గిరిజనుల 30 ఎకరాల భూమిని తన భూమితో కలిపేసుకున్నారు. బెదిరించి మరీ గెంటేసి చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నారు. చివరకు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
చివరకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫిర్యాదు చేయడానికి చేయడానికి వెళ్లిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. 50 ఏళ్ల క్రితం కుటుంబానికి ఒకటి, రెండు ఎకరాల చొప్పున ప్రభుత్వం వారికి భూములు పంపిణీ చేసింది. అందుకు గుర్తుగా పట్టా పాస్ పుస్తకాలు జారీచేసింది.

 2014లో అధికారంలోకి రాగానే ఇలా చక్రం తిప్పారు

2014లో అధికారంలోకి రాగానే ఇలా చక్రం తిప్పారు

ఆ గిరిజనుల భూములను ఆనుకునే ఓ మహిళా నాయకురాలి పొలం ఉంది. ఆ మహిళా నేత మెదక్ జడ్పీటీసీ సభ్యురాలు లావణ్యారెడ్డి. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. ఆమె తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి నమ్మిన బంటు అని పేరుంది. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే, తాను పదవి చేపట్టగానే చక్రం తిప్పారు. అధికార బలం ఉపయోగించి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేశారు. వారికి గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన 30 ఎకరాలను కబ్జా చేసి, తన పొలంలో కలిపేసుకుని చుట్టూ కంచె (ఫెన్సింగ్‌) ఏర్పాటు చేశారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా పటిష్ఠమైన గేటు కూడా పెట్టారు. తమకు న్యాయం చేయాలంటూ మూడున్నర ఏళ్లుగా గిరిజనులు తిరుగుతున్నా అధికారులు కనీసం విచారణ కూడా జరపక పోగా, సదరు మహిళా నేతకే వత్తాసు పలుకుతున్నారు.

 మెదక్ జడ్పీటీసీ మాటంటే అధికారులకు వేదం

మెదక్ జడ్పీటీసీ మాటంటే అధికారులకు వేదం

డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి కుడి భుజంగా వ్యవహరించే మెదక్‌ జడ్పీటీసీ లావణ్యా రెడ్డి పేరు చెబితేనే పార్టీ శ్రేణులు, నాయకులు, అధికారులు హడలిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆమె అనుమతి లేనిదే ఏ పనీ జరగదంటే అతిశయోక్తి కాదు. మెదక్‌ మండలం రాజ్‌‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బాలానగర్‌ తండా నివాసులైన గిరిజనులకు 50 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం భూములను పంపిణీ చేసింది. వెల్దుర్తికెళ్లే దారిలో రహదారి పక్కనే ఉన్న 33/1 సర్వే నంబర్‌లో సుమారు 30 ఎకరాలను 12 మంది లబ్ధిదారులకు సాగు చేసుకుని జీవించేందుకు పట్టా పుస్తకాలు జారీ చేశారు. ఆ భూములు పంపిణీ చేనప్పుడు రాళ్లు రప్పలతో సాగుకు పనికి రాకుండా ఉండేవి. గిరిజనులు రెక్కలు ముక్కలు చేసుకుని వాటిని సాగు యోగ్యంగా తయారు చేశారు. బావులు, బోర్లు వేసుకుని పంటలు పండిస్తున్నారు. పలువురు బ్యాంకుల్లో రుణాలు సైతం తీసుకున్నారు. కానీ, అదే గ్రామ వాసి లావణ్యా రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌పై జడ్పీటీసీగా విజయం సాధించారు. ఆమె కుటుంబీకులకు అక్కడే పెద్దఎత్తున భూములు ఉన్నాయి. గిరిజనుల భూములు కూడా వాటిని ఆనుకుని ఉండటంతో ఎంతో కాలంగా కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 గవర్నర్ నరసింహన్‌ను కలువకుండా ఇలా భద్రత

గవర్నర్ నరసింహన్‌ను కలువకుండా ఇలా భద్రత

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, ‘ఈ భూములు మావి.. మీరంతా వేరే చోటకు వెళ్లి వ్యవసాయం చేసుకోండి' అంటూ ఆమె గిరిజనులకు హుకుం జారీ చేశారు. వ్యవసాయ బావులను పూడ్చి వేసి తన భూముల్లో కలిపేసుకుని, చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. తనపై ఫిర్యాదు చేసినా ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించారు. భూముల ఆక్రమణపై 2014 నుంచి ఇప్పటి వరకూ మండల, డివిజన్‌, జిల్లా అధికారుల వరకూ లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఈ కబ్జాపై సాక్షాత్తూ సర్పంచ్ స్పందించి, గ్రామ పంచాయతీ లెటర్‌ హెడ్‌పై ఫిర్యాదు చేసినా, రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు. భూమి రికార్డుల నవీకరణలో పాల్గొనడానికి గవర్నర్‌ నరసింహన్‌ సెప్టెంబర్ నెలలో మెదక్‌ మండలంలోని పాషాపూర్‌కు వచ్చారు. ఆయనకు వినతి పత్రం సమర్పించేందుకు గిరిజనులంతా వెళ్లారు. కానీ, సదరు ప్రజా ప్రతినిధి పోలీసులకు చెప్పి గవర్నర్‌ను కలవకుండా వారిని అడ్డుకున్నారు. గవర్నర్‌ సభ ముగిసే వరకూ పోలీసులను కాపలాగా పెట్టారు.

కబ్జాలో ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్న మెదక్ ఆర్డీవో

కబ్జాలో ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్న మెదక్ ఆర్డీవో

తాము భూములు కబ్జా చేయలేదని, సీలింగ్‌ భూములపై న్యాయస్థానంలో కేసు వేయగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని జడ్పీటీసీ లావణ్యా రెడ్డి అధికారులతోపాటు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ, దానిని బయటపెట్టడం లేదు. ఇప్పటికీ పహాణీలో ఆ భూములు గిరిజనుల పేరిటే ఉండటం గమనార్హం. 35 ఏళ్లుగా సర్కార్ ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకొని బతికామని బాలా నగర్ తండా వాసి రుపావత్ కిషని తెలిపారు. మూడేళ్ల క్రితం జడ్పీటీసీ వచ్చి భూముల నుంచి తమను వెళ్లగొట్టి, వేరే చోటుకి వెళ్లి దున్నుకోవాలని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పక్షవాతంతో మంచాన పడ్డాడు. ఇప్పుడు ఎలా బతకాలని వాపోతున్నారు. బాలానగర్‌లో 33 సర్వే నంబర్‌ పరిధిలో భూములు కబ్జా అయినట్లు పలువురు గ్రామస్థులు ఫిర్యాదు చేశారని మెదక్ ఆర్డీవో మెంచు నగేశ్ గౌడ్ చెప్పారు. దానిపై గ్రామానికి వెళ్లి విచారించాలని తహశీల్దార్‌ను ఆదేశించానని ఆయన నివేదిక ప్రకారం కబ్జా ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వివరించారు.

English summary
Lavanya Reddy. She is ZPTC for Medak Mandal and also right hand Telangana deputy speaker Padma Devender Reddy. After TRS come to the power in Telangana ZPTC member Lavanya Reddy actively reacted. She has occupied tribals irrigated land in their own village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X