వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెస్ట్ హౌజ్‌లో దాక్కున్న మెలానియా: ట్రంప్‌కు భంగపాటు.. ఆమె ఎందుకలా చేసిందో?

వాతావరణ శాస్త్రవేత్తల సారధ్యంలో జరిగే ఒక కార్యక్రమంలో, హేంబర్గ్‌లో జరిగే మరో కార్యక్రమంలో ఆమె పాల్గొనాల్సి ఉన్నా, హాజరు కాలేకపోయారని అన్నారు.

|
Google Oneindia TeluguNews

జులై: జర్మనీలోని హేంబర్గ్ జీ-20దేశాల సదస్సుకు వేదికైన సంగతి తెలిసిందే. మహిళా సాధికారత, కౌంటర్ టెర్రరిజం, దేశ భద్రత, వృద్దిరేటు పెరుగుదల, యూరోపియన్ వలస సంక్షోభం, వంటి పలు అంశాలపై ఈ సమ్మిట్ లో ఆయా దేశాల అధ్యక్షులు చర్చించనున్నారు.

చైనాపై చర్యలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై చర్యలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ఈ సమావేశం కోసం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియాతో కలిసి హేంబర్గ్ నగరానికి వచ్చారు. అయితే జీ-20ని సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ హేంబర్గ్ నగరంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. మెలానియా గెస్ట్ హౌజ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

మెలానియాకు అనుమతి ఇవ్వలేదు:

మెలానియాకు అనుమతి ఇవ్వలేదు:

ఆందోళనకారులు విరుచుకుపడుతుండటంతో.. భద్రతా రీత్యా బయటకు వెళ్లేందుకు మెలానియాకు అనుమతి లభించలేదు. నిజానికి జి-20 సదస్సులో వివిధ దేశాధ్యక్షుల సతీమణులతో మెలానియా భేటీ కావాల్సి ఉంది. కానీ జర్మన్ పోలీసులు అనుమతినివ్వకపోవడంతో.. ఏ అధికారిక కార్యక్రమంలోను ఆమె పాల్గొనలేకపోయారు.

గెస్ట్ హౌజ్ లోనే దాక్కుని:

గెస్ట్ హౌజ్ లోనే దాక్కుని:

మెలానియా ట్రంప్ ప్రతినిధి స్టీఫన్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. స్థానిక పోలీసులు అనుమతినివ్వకపోవడంతో పలు కార్యక్రమాలకు గైర్హాజరైనట్లు తెలిపారు. వాతావరణ శాస్త్రవేత్తల సారధ్యంలో జరిగే ఒక కార్యక్రమంలో, హేంబర్గ్‌లో జరిగే మరో కార్యక్రమంలో ఆమె పాల్గొనాల్సి ఉన్నా, హాజరు కాలేకపోయారని అన్నారు. అయితే మెలానియా గెస్ట్ హౌజ్ లోనే దాక్కుండిపోయారని దీని గురించి ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

ట్రంప్‌కు అవమానం:

ట్రంప్‌కు అవమానం:

అమెరికా అధ్యక్షుడ ట్రంప్‌కు పోలండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాకు షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో.. వెనకాలే వచ్చిన ఆయన సతీమణి గాతా కార్న్‌హౌసెర్‌, ట్రంప్ ను తప్పించుకుని మెలానియాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆండ్రెజ్ భార్యతో షేక్ హ్యాండ్‌కు యత్నించిన ట్రంప్ భంగపడ్డట్లయింది.

అవమానంగా ఫీలై:

అవమానంగా ఫీలై:

పోలండ్ అధ్యక్షుడి సతీమణి చర్యతో ట్రంప్ ఒకింత ముభావంగా కనిపించారు. అయితే విషయాన్ని గమనించిన గాతా కార్న్‌హౌసెర్‌.. తిరిగి వెనక్కి వచ్చి ట్రంప్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ట్విట్టర్‌లో వైరల్ గా మారాయి. దీనిపై స్పందించిన పోలండ్ అధ్యక్షుడు.. తన భార్య ట్రంప్‌ను పట్టించుకోలేదన్న వార్తలో వాస్తవం లేదన్నారు. అధ్యక్షుడు చెప్పిందే నిజమైతే.. మరి గాతా కార్న్ అలా ఎందుకు వ్యవహరించి ఉంటారనేది చాలామంది ప్రశ్న.

English summary
Melania Trump reportedly has been unable to leave her hotel all day Friday because of chaotic protests over the G-20 summit in Hamburg, Germany, local and international outlets report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X