వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా బాధిత పురుషులూ ఎక్కువే!: కొడుతున్నారంటూ వీడియోలు చూపిస్తున్నారు!

ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్‌కు సాధారణంగా వివాహిత మహిళల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా అందుతుంటాయి.. కానీ, ఇక్కడ మాత్రం తమ భార్యలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తుండ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్‌కు సాధారణంగా వివాహిత మహిళల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా అందుతుంటాయి.. కానీ, ఇక్కడ మాత్రం తమ భార్యలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. మహిళా కమిషన్‌కు అందుతున్న కేసుల్లో 25శాతం మహిళా బాధితులైన పురుషఉల నుంచి వస్తున్నవేనని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వెల్లడించడం గమనార్హం. భార్యలు కొడుతున్నారంటూ సాక్ష్యాలుగా వీడియోలు కూడా చూపిస్తున్నారని పేర్కొన్నారు.

men also complained on women for harassing them

బుధవారం తాత్కాలిక అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా నన్నపనేని అటువైపుగా వెళ్తూ ఆగారు. దీంతో మహిళా కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆమెను కోరారు.

మగవాళ్లు తమను చూస్తున్నారంటూ ఎవరైనా మహిళ ఫిర్యాదు చేయగానే కేసులు పెట్టేయడం ఎంతవరకు సబబని ఆయన నవ్వుతూ ఆమెతో అన్నారు. ఈ విషయంలో మహిళా కమిషన్ దయ చూపించాలని అన్నారు. కాగా, దీనిపై నన్నపనేని స్పందించారు. చూస్తేనే కేసులు పెడుతున్నారనడం సరికాదని, అసభ్యంగా చూస్తేనో, ప్రవర్తిస్తేనో మాత్రమే కేసులుంటాయని జవాబిచ్చారు.

English summary
t is said that few men also complained to women's commission on women for harassing them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X