వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపు తెచ్చిన తంటా: అఖిల వర్సెస్ ఆది, ఆ పదవి కోసం జోరుగా లాబీయింగ్?

మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం చాలామందికి హామిలివ్వడంతో.. ఆశావహులంతా ఇప్పుడు టీడీపీ జుట్టు పీకుతున్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఒక్క గెలుపు కోసం ఎడాపెడా ఎవరికి పడితే వారికి హామిలిచ్చుకుంటూ వెళ్లిన టీడీపీకి ఇప్పుడు దాని సెగ తగులుతోంది. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా.. మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం చాలామందికి హామిలివ్వడంతో.. ఆశావహులంతా ఇప్పుడా పార్టీ జుట్టు పీకుతున్నారు.

తమకంటే తమకే పదవి దక్కాలన్న ఆరాటంలో.. సొంత పార్టీ నేతల మధ్యే విభేదాలు బహిర్గమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రులు అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి మధ్య ఈ పదవి విషయంలో తీవ్ర అంతర్గత పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

అఖిల వర్సెస్ ఆది:

అఖిల వర్సెస్ ఆది:

ఉపఎన్నిక సందర్భంగా తాను హామి ఇచ్చినవారికే మార్కెట్ యార్డు చైర్మన్ పదవి దక్కాలని ఆది భావిస్తుంటే.. తన తండ్రి బతికి ఉన్నప్పుడు ఎవరికైతే హామి ఇచ్చారో వారికే దక్కాలని అఖిల పోరాడుతోంది. ఈ ఇద్దరు ఎవరికి వారు అధిష్టానం వద్ద చైర్మన్ గిరి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా, నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్‌గా శిల్పామోహన్‌రెడ్డి అనుచరుడు సిద్ధం శివరాం ఏడాదిన్నరపాటు కొనసాగారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరాక.. ఆయన పదవిని పొడగించలేదు. ఆ తర్వాత వేరొకరిని నియమించకపోవడంతో.. అప్పటినుంచి అది ఖాళీగానే ఉంది. అదే సమయంలో తన అనుచరులకే ఆ పదవి దక్కేలా భూమా చాలా సిఫార్సులే చేశారు.

Recommended Video

Nandyal Bypoll Results : TDP defeats YSRCP Over 27000 Votes | Oneindia Telugu
చైర్మన్ గిరి ఆశచూపి:

చైర్మన్ గిరి ఆశచూపి:


దాదాపు ఏడాది కాలంగా మార్కెట్ యార్డు చైర్మన్ ఆ పదవి ఖాళీగానే ఉంది. దీంతో నంద్యాల ఉపఎన్నికల్లో ఆ పదవిని ఆశ చూపి టీడీపీ నేతలు భారీగానే ఓట్లు దండుకున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఎవరికే వారే తమ అనుచరులకు హామిలిచ్చేయడంతో.. హామిలను నిలబెట్టుకోవాలని వారంతా పట్టుబడుతున్నారు.

శీలం భాస్కర రెడ్డి, మునగాల లక్ష్మీకాంతరెడ్డిలకు చైర్మన్ పదవిపై భూమా గతంలో హామి ఇచ్చారు. తండ్రి ఇచ్చిన హామి మేరకు మంత్రి అఖిలప్రియ వారికే పదవి దక్కాలని పోరాడుతున్నారు. వీరిద్దరిలో ఒకరి పేరును ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఆది.. ఫరూక్.. ఎవరికి వారే:

ఆది.. ఫరూక్.. ఎవరికి వారే:

మరోవైపు ఆది నారాయణ రెడ్డి సైతం.. తన అనుచరులైన కానాల గురునాథ్ రెడ్డి, సాయినాథ్ రెడ్డిలకు చైర్మన్ పదవి ఇప్పిస్తానని హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదితో పాటు భూమా కుటుంబంతోను వీరికి సాన్నిహిత్యం ఉండటంతో తమలో ఒకరికి పదవి దక్కుతుందని వీరు నమ్మకంగా ఉన్నారు.

ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఫరూక్ సైతం తన అనుచరులకు పదవిపై హామి ఇచ్చారు. శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ జయచంద్రారెడ్డి, మహానంది మాజీ దేవస్థానం చైర్మన్ కంచెర్ల సురేష్ రెడ్డిలకు చైర్మన్ పదవిపై ఆయన హామి ఇచ్చినట్లు సమాచారం.

సీఎం కూడా హామి ఇచ్చేశారు:

సీఎం కూడా హామి ఇచ్చేశారు:

ఇదంతా ఇలా ఉంటే, సీఎం చంద్రబాబు నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి తనకే ఇస్తానన్నారని మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బనాయుడు పేర్కొనడం గమనార్హం. ఎన్నికలకు ముందు సీఎంను కలిసిన సమయంలో తనకు కూడా చైర్మన్ పదవిపై హామి ఇచ్చారని కాపు డైరెక్టర్ రామచంద్రారావు చెప్పారు. ఈ నెల 6న బలిజ సంఘం ఆధ్వర్యంలో సీఎంను కలవబోతున్నట్లు కూడా తెలిపారు.

ఎవరికి దక్కుతుందో?:

ఎవరికి దక్కుతుందో?:

ఇంత మంది ఆశావహుల్లో మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. పదవి దక్కనివాళ్లంతా కచ్చితంగా పార్టీపై అసహనం వెళ్లగక్కే అవకాశం లేకపోలేదు. ఉపఎన్నికను గెలిపించుకున్న నేపథ్యంలో.. అఖిలప్రియ సూచించినవారికే చైర్మన్ గిరి దక్కుతుందన్న ప్రచారం కూడా ఉంది. మరి అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో వేచి చూడాలి.

English summary
Ministers Bhuma Akhilapriya, Adi Narayana Reddy are fighting for Nandyala Market Chairman post,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X