వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డికి షాక్: గుట్టువిప్పిన మోత్కుపల్లి, టిఆర్ఎస్‌తో టిడిపి సై

2019 ఎన్నికల్లో పొత్తు అంశం తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్‌తో వెళ్లే అంశంపై నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో పొత్తు అంశం తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్‌తో వెళ్లే అంశంపై నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

చెప్పారు కానీ.. బాబుకు మోడీ షాక్: మోత్కుపల్లికి గవర్నర్ ఛాన్స్ లేనట్లే?చెప్పారు కానీ.. బాబుకు మోడీ షాక్: మోత్కుపల్లికి గవర్నర్ ఛాన్స్ లేనట్లే?

తాజాగా టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాకిచ్చేవిలా ఉన్నాయి. రేవంత్ ఒకటి ఆలోచిస్తే.. మోత్కుపల్లి మరొకటి ఆలోచిస్తున్నారు.

 పొత్తుపై మోత్కుపల్లి ఇలా

పొత్తుపై మోత్కుపల్లి ఇలా

ఎన్నికల్లో పొత్తు అంటూ కుదిరితే బిజెపి లేదా అధికార తెరాసతోనే ఉంటుందని, కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఉండదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడైన మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టిడిపి మద్దతు లేకుండా టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.

గవర్నర్ పదవి లిస్టులో పేరు లేకపోవడం బాధగా ఉంది

గవర్నర్ పదవి లిస్టులో పేరు లేకపోవడం బాధగా ఉంది

తన నివాసంలో మంగళవారం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ల జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందన్నారు. వాస్తవానికి నేను గవర్నర్‌ పదవి అడగలేదని, రాజ్యసభ ఎంపీ ఇవ్వాలని కోరగా గరికపాటికి ఇచ్చారని, అప్పుడే తనకు గవర్నర్‌ పదవి వస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. అది నెరవేరుతుందని మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పారు.

 మోత్కుపల్లి కుటుంబ సభ్యుల కంటతడి

మోత్కుపల్లి కుటుంబ సభ్యుల కంటతడి

మూడేళ్లలో తాను ఎక్కడికి వెళ్లిన చాలామంది తనను గవర్నర్‌గానే చూశారని, మొన్నటి జాబితాలో పేరు లేకపోవడంతో దసరా పండుగను కూడా జరుపుకోలేదని, తమ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారని, రాజ్యసభ ఇస్తరని అనుకుంటున్నానని మోత్కుపల్లి చెప్పారు.

మోత్కుపల్లి మాట.. రేవంత్ రెడ్డికి షాక్

మోత్కుపల్లి మాట.. రేవంత్ రెడ్డికి షాక్

ఇదే సమయంలో మోత్కుపల్లి పొత్తుల గురించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌తో వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. తెరాసనే తమ ప్రత్యర్థి అని, బిజెపితో కలిసి వెళ్లే ఉద్దేశ్యం లేదని రేవంత్ గతంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకైనా సిద్ధమని రేవంత్ పలుమార్లు ప్రకటించారు. మోత్కుపల్లి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఇది రేవంత్‌కు షాక్ అని చెప్పవచ్చు.

English summary
Telangana Telugu Desam Party leader Mothkupalli Narsimhulu on Tuewsday said that
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X