వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య చేయి పట్టుకుంటే ‘నొప్పులు’ ఉండవు!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: భార్య భర్తల అనుబంధం వారి మధ్య ఉన్న పలు సమస్యలకు పరిష్కారం లభించనుందని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది. ప్రసవ సమయంలో భార్య చేయి పట్టుకుంటే.. నొప్పుల తీవ్రత ఆమెను అంతగా బాధించదని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.

ఇదే కారణం

ఇదే కారణం

భర్త గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీరులను ఆమెతో జతచేస్తూ నేనున్నానని భరోసా ఇవ్వడమే దీనికి కారణమని వివరిస్తోంది. అమెరికాలోని కొలరాడో వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు.

జంటలపై పరిశోధన

జంటలపై పరిశోధన

23 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్న 22 జంటలు దీనిలో పాల్గొన్నాయి. మహిళలకు కృత్రిమంగా నొప్పులను సృష్టించి.. వారి భర్తలను మొదట చూస్తూ ఉండమన్నారు. కొద్దిసేపటి తర్వాత తాకకుండా పక్కన కూర్చోమన్నారు.

నోప్పుల తీవ్రత తక్కువగా..

నోప్పుల తీవ్రత తక్కువగా..

అనంతరం భార్య చేతిలో చెయ్యివేసి పట్టుకోమన్నారు. ఈ మూడు పరిస్థితుల్లో వారిలో గుండె, శ్వాస తీరు, నొప్పుల స్థాయిలను పరీక్షించారు. దీంతో భార్య భావాలను ఎక్కువగా అర్థం చేసుకునే పురుషులు చేయిపట్టుకున్నప్పుడు నొప్పుల తీవ్రత తక్కువగా ఉంటున్నట్లు వెలుగులోకి వచ్చింది.

జత కలివడంతోనే..

జత కలివడంతోనే..

మెదడు తరంగాలు సహా గుండె వేగం, శ్వాస తీరు లాంటివి భార్యాభర్తల మధ్య జత కలవడమే దీనికి కారణమని పరిశోధకులు పావెల్‌ గోల్డ్‌స్టెయిన్‌ వెల్లడించారు. అందుకే భర్తలు నొప్పుల సమయంలో తమ భార్యల వద్ద ఉండి ఇలా చేయడం వల్ల వారికి ఉపశమనం కలుగుతుందని సూచించారు.

English summary
It is said that no pain effect to pregnant wife, when her husband hand touching her hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X