• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉ.కొరియా వెనుక ఆ దేశం: అమెరికాకు ఊహించని షాక్?, ద్వంద్య నీతికి పరాకాష్ఠ!

|

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అగ్ర దేశాలన్ని ద్వంద్వ నీతినే పాటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. యుద్దం విషయంలో ఈ దేశాలు పైకి మాత్రం శాంతి హితబోధ చేసినా.. అంతర్గతంగా ఆయుధ తయారీ విషయంలో ఎవరి పంథా వారిదే.

కిమ్ ధ్వంస రచన?: అమెరికాపై అణుదాడి తప్పదని ఉ.కొరియా సంచలన ప్రకటన

ఉత్తరకొరియా విషయంలో అమెరికా ఇదే ద్వంద్వ నీతిని పాటిస్తుందన్న విమర్శలు ఇదివరకే వెల్లువెత్తాయి. ఇప్పుడు రష్యా విషయంలోను అమెరికా నుంచి ఇవే విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం. ఉత్తరకొరియాకు సొంతంగా బాలిస్టిక్ మిస్సైల్స్ ను తయారుచేసుకునే సామర్థ్యం లేదని ముందు నుంచి అనుమానిస్తున్న అమెరికా.. దీని వెనకాల రష్యా ఉన్నట్లుగా అనుమానాలను వెలిబుచ్చుతోంది.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

రష్యా సహాయమా?:

రష్యా సహాయమా?:

ఉత్తరకొరియా అణుక్షిపణి రాకెట్ ఇంజిన్‌లను ఉక్రెయిన్ లోని ఓ ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నారని ఇందుకోసం దౌత్యపరంగా రష్యా ఆ దేశానికి సహాయం అందిస్తోందని అమెరికా ఇంటలిజెన్స్ భావిస్తోంది. ఉత్తరకొరియా రాకెట్ ప్రయోగ సమయంలో తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను పరిశీలిస్తే తమకు ఆ విషయం అర్థమైందని అమెరికన్ ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?

ఉక్రెయిన్‌లో తయారీ:

ఉక్రెయిన్‌లో తయారీ:

ఇంటలిజెన్స్ మిస్సైల్ నిపుణుడు మైకేల్‌ఎల్‌మేన్ ఉత్తరకొరియా క్షిపణులు పరిశీలించారని, వాటిని ఉక్రెయిన్ రాకెట్ ఇంజిన్‌లుగా ఆయన గుర్తించారని తెలిపారు. ఉత్తరకొరియా టెక్నాలజీ సామర్థ్యంపై తమకు ముందు నుంచి నమ్మకం లేదని, రష్యా సహకారం వల్లే ఇదంతా సాధ్యపడిందని భావిస్తున్నట్లు వారు తెలిపారు.

నిజానికి చైనాతో బలమైన సంబంధాలు కలిగిన ఉత్తరకొరియా, టెక్నాలజీ పరంగా రష్యా సహకారం తీసుకోడం నిజంగా నమ్మశక్యం కాని విషయమని వారు అభిప్రాయపడుతున్నారు.

పుతిన్ అప్పుడేమన్నారు.. ఇప్పుడెందుకిలా?:

పుతిన్ అప్పుడేమన్నారు.. ఇప్పుడెందుకిలా?:

ఇదిలా ఉంటే, జీ-20దేశాల సమ్మిట్ లోను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తరకొరియా పట్ల ఎవరూ సహనం కోల్పోవద్దని, త్వరలో తానే స్వయంగా ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ తో చర్చలు జరుపుతారని పేర్కొనడం గమనార్హం. దీన్నిబట్టి ఓవైపు ఉత్తరకొరియాను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామన్న భావన కల్పిస్తూనే మరోవైపు అణ్వాయుధాల కోసం రష్యా ఆ దేశానికి సహాయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పుతిన్ ద్వంద్వ నీతి పట్ల అమెరికా ఏం చేయబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

ఉద్రిక్తతలకు తెరపడేనా:

ఉద్రిక్తతలకు తెరపడేనా:

ఉత్తరకొరియా-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రానురాను మరింత ముదురుతున్నట్లుగానే కనిపిస్తున్నాయి. రష్యాపై అమెరికాకు తలెత్తిన అనుమానం ఈ యుద్ద వాతావారణాన్ని మరింత పెంచేదిగా తయారైంది. రెండు బలమైన దేశాల మధ్య ఇలాంటి వాతావరణం ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ప్రమాదం లేకపోలేదు. దీనిపై అమెరికా-రష్యా వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు.

English summary
North Korea’s success in testing an intercontinental ballistic missile that appears able to reach the United States was made possible by black-market purchases of powerful rocket engines probably from a Ukrainian factory
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more