గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూటే సెపరేట్, కన్నాతో రావెల భేటీ: బాబుకు షాకిస్తారా?

పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారి మంత్రి పదవి కోల్పోయిన రావెల కిశోర్ బాబు రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఆయన తన ముద్రను వేయడానికి ప్రయత్నించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారి మంత్రి పదవి కోల్పోయిన రావెల కిశోర్ బాబు రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఆయన తన ముద్రను వేయడానికి ప్రయత్నించారు. మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు.

తాజాగా ఆయన బిజెపి నేత కన్నా లక్ష్మినారాయణను కలిశారు. దీంతో రావెల ఏం చేస్తారనే విషయంపై చర్చ ప్రారంభమైంది. మంత్రి పదవిలో కొనసాగినప్పుడు ఆయన ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ వచ్చారు. ఆయన కన్నా లక్ష్మినారాయణతో భేటీ కావడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో తన సీటు తనకు భద్రంగా ఉండేలా చూసుకోవడమే రావెల భేటీ ఆంతర్యమా, లేదంటే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తూ బిజెపిలో చేరిపోతారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

 అనూహ్యంగా మంత్రి పదవి...

అనూహ్యంగా మంత్రి పదవి...

రావెల కిశోర్ బాబుకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అనుకోకుండానే పత్రిపాడు ఎమ్మెల్యే సీటు దక్కి విజయం సాధించారు కూడా. తనకు ఆ స్థానం కల్పించిన చంద్రబాబును మెప్పించడంలో ఆయన విఫలమయ్యారని, అందుకే మంత్రి పదవి పోయిందని అంటున్నారు. పార్టీలో గ్రూపులను కూడా కట్టడి చేయలేకపోయారని అంటున్నారు. పలు మార్లు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ వద్ద పంచాయితీలు కూడా జరిగినట్లు చెబుతున్నారు.

మనిషే మారెనా....

మనిషే మారెనా....

మంత్రిగా ఉన్నప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టరీ అధినేత జగన్‌పై నిత్యం రెచ్చిపోయి విమర్శలు చేస్తూ వచ్చారు. కొన్ని సార్లు పార్టీ విధానాలకు సంబంధించిన అంశాల్లో కూడా జోక్యంచేసుకునే దశకు చేరుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బిజెపిలో చేరిన సందర్భంలో ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. కన్నాపై విమర్శలతో సరిపెట్టకుండా ఇటువంటి చర్యలు పునరావృతం అయితే బిజేపీతో పొత్తు విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. దాంతో ఆయనకు ముఖ్యమంత్రి అక్షింతలు కూడా వేశారు.

పుట్టిన రోజు వేడుకలకు....

పుట్టిన రోజు వేడుకలకు....

కన్నా లక్ష్మీనారాయణను విమర్శించిన రావెల కిషోర్‌బాబు ఆయన పుట్టినరోజు వేడుకలకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. చంద్రబాబుపై కాంగ్రెసులో ఉన్నప్పుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనపై విరుచకుపడేవారు. అయితే, బిజెపిలో చేరిన తర్వాత ఆయనపై టిడిపి నాయకులు విమర్శలకు స్వస్తి చెప్పారు. కానీ రావెల దూకుడుగా వ్యవహరించి ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు.

మందకృష్ణ మాదిగ విషయంలోనూ

మందకృష్ణ మాదిగ విషయంలోనూ

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మంద కృష్ణమా దిగ విషయంలోనూ రావెల కిశోర్ బాబు తీరు వివాదంగా మరింది. కొద్ది కాలం క్రితం కురుక్షేత్రం పేరుతో మంగళగిరి సమీపంలో మంద కృష్ణమాదిగ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతి రేకంగా నిర్వహించే సభను విజయవంతం చేయాల్సిందిగా వెలిసిన పోస్టర్లలో రావెల ఫొటోలు చోటు చేసుకున్నాయి. అది తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. రావెల అనుమతితోనే పోస్టర్లు వెలిశాయనే ప్రచారం జరిగింది. అయినా రావెల మాత్రం ఖండించలేదు.

వ్యూహాత్మకంగానే...

వ్యూహాత్మకంగానే...

రాజకీయ వ్యూహంలో భాగంగానే రావెల కిశోర్ బాబు పావులు కదుపుతున్నారని అంటున్నారు. కృష్ణ మాదిగ విషయంలో తన సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే అలా వ్యవహరించారని వివరిస్తున్నారు.తాజాగా మాజీ మంత్రి కన్నాకు దగ్గరవటం కూడా రాజకీయ వ్యూహం లో భాగమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అందుకేనా....

అందుకేనా....


తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో గుంటూరు రూరల్‌ మండలం ఉంది. ఆ మండలంలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.. అందువల్లే కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కు ఆయన పుట్టిన రోజు వంకన దగ్గరయ్యారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగే పక్షంలో కన్నా అవసరం రావెలకు ఉంటుంది. అయితే, కన్నా, రావెల కలయికను తప్పు పట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు.

పొత్తు లేకపోతే...

పొత్తు లేకపోతే...

ప్రస్తుతం తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు ఉంది కాబట్టి సీటు తిరిగి దక్కడానికి, ఆ తర్వాత విజయం సాధించడానికి కన్నా అవసరం తనకు ఉందని రావెల భావించినట్లు చెబుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి సీటును ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ కన్నా మద్దతు కోసం కలిశారని అంటున్నారు. అయితే, చంద్రబాబుకు షాక్ ఇస్తూ ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధపడినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది.

English summary
Debate is going on in Andhra Pradesh politics on the meeting of Telugu Desam party leader Ravela Kishore Babu wih BJP leader Kanna Lakshminarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X