వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరాబాబా ఓన్లీ యాక్షన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా.. హనీప్రీత్! ఆర్టీఐ యాక్ట్ తో బట్టబయలు..

డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో తాజాగా వెల్లడైంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో తాజాగా వెల్లడైంది. ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తు ఆస్త్రంతో డేరా సామ్రాజ్యానికి సంబంధించి నివ్వెరపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి.

డేరా బాబా వ్యాపార కార్యకలాపాల విస్తరణ, దేశ విదేశాల నుంచి డేరాకు అందిన విరాళాలు ఉపయోగించిన తీరు విస్మయం కలిగిస్తోంది. గుర్మీత్ వ్యాపార వ్యూహాలు.. సినీ, ఈవెంట్ రంగాల్లో ప్రవేశం.. వీటిన్నింటి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా హనీప్రీత్ దే అని అర్థమవుతోంది.

 ఆర్టీఐ దరఖాస్తు దెబ్బతో...

ఆర్టీఐ దరఖాస్తు దెబ్బతో...

డేరా సచ్ఛా సౌదా సంస్థ ఆర్థిక లావాదేవీల వివరాలు ఇచ్చేందుకు ఆదాయపన్ను శాఖ నిరాకరించినా ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం కోరడంతో డేరాబాబా విన్యాసాలు వెలుగులోకి వచ్చాయి. మత విశ్వాసాలు, ఆథ్యాత్మిక కార్యక్రమాల పేరిట దేశ విదేశాల నుంచి డేరాబాబా ప్రతీయేటా కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వసూలు చేసే వాడట. ఈ నిధులను వ్యాపార కార్యక్రమాల విస్తరణకు వినియోగించడంతో డేరా సచ్ఛా సౌదా చాలా కొద్దికాలంలోనే ఒక కార్పొరేట్ సంస్థ స్థాయికి ఎదిగింది.

Recommended Video

Gurmeet Ram Rahim is a $ex addict 'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి
 ఒక్క పైసా పన్ను కట్టకుండా...

ఒక్క పైసా పన్ను కట్టకుండా...

2010-11లో డేరా రూ 50 కోట్ల పైగా నికర లాభం ఆర్జించింది. అంటే సంస్థ టర్నోవర్‌ ఏ రేంజ్‌లో ఉందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో డేరా నికర లాభం 30 కోట్లు కాగా, అనుబంధ సంస్థ షా సత్నం జీ రీసెర్చి ఫౌండేషన్‌ 16.5 కోట్లు నికర లాభం సాధించింది. అయినా కూడా డేరా సచ్ఛా సౌదా ఒక్క పైసా కూడా ఆదాయపన్ను చెల్లించ లేదు. కారణం.. సామాజిక, ఆథ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడమే. ఫలితంగా ఆదాయపన్ను శాఖ నుంచి డేరా మినహాయింపు పొందింది.

 కోట్లు కురిపించిన మ్యూజికల్ నైట్స్...

కోట్లు కురిపించిన మ్యూజికల్ నైట్స్...

డేరాబాబా గుర్మీత్ కార్యక్రమాల వెనుక ఉన్న స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా హనీప్రీత్ దే అని అర్థమవుతోంది. హనీప్రీత్ సింగ్ తనకున్న నెట్ వర్కింగ్ నైపుణ్యాలతో డేరా సచ్ఛా సౌదా సంస్థకు నిధులు, విరాళాలు సమకూర్చేదట. అంతేకాదు, గుర్మీత్ మ్యూజికల్ నైట్స్ ప్రారంభం, సినిమాల వెనుక కూడా హనీప్రీత్ హస్తమే ఉందట. డేరా అనుచరుల్లో ఈ మ్యూజికల్ నైట్స్ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఒక్క రాత్రికే కోట్ల రూపాయలు వచ్చిపడేవట. ఈ మ్యూజికల్ నైట్స్ లో గిటార్ పట్టి ‘లవ్ చార్జర్' అంటూ డేరాబాబా తన గానకళకు పదునుపెట్టే వాడు. డేరాబాబా నటించిన సినిమాలు కూడా హనీప్రీత్ ఆలోచనల్లోంచి పుట్టినవే.

హనీప్రీత్ ఆ డబ్బును తరలించిందా?

హనీప్రీత్ ఆ డబ్బును తరలించిందా?

అత్యాచారం కేసుల్లో డేరాబాబా అరెస్టయి జైలుకెళ్లిన తరువాత డేరా ప్రాంగణంలో పోలీసులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సోదాల్లో కొద్దాపాటి నగదు మాత్రమే లభ్యమవడం పలు సందేహాలు లేవనెత్తింది. మరి ఆ కోట్ల రూపాయల డబ్బు ఏమైనట్లు? అక్రమంగా దాచిన డబ్బును గుర్మీత్ అనుచరులు డేరా నుంచి రహస్యంగా బయటికి తరలించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి... సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం నుంచి ఆగస్టు 28న రాత్రి హనీప్రీత్ సింగ్ రెండు పెద్ద సూట్ కేసులతో అదృశ్యమవడం కూడా బలం చేకూర్చింది. ప్రస్తుతం పోలీసులు ఆ సొమ్మును ఎక్కడికి తరలించారనే కోణంలో హనీప్రీత్ ను విచారిస్తున్నారు.

English summary
Information sought under the Right to Information (RTI) Act reveals that Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim expanded his business like a corporate house with money given by his followers as donation to his sect. Serving 20-year-sentence for rape and sexual exploitation of two of his devotees, Gurmeet Ram Rahim minted crores of rupees every year in the name of faith. Dera took donations for its social welfare and religious wings and used the money to further his commercial ambitions. This way, his earnings in the name of social welfare and religious functions remained untaxed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X