తప్పు చేసి దొరికిపోయిన సానియా: సెటైర్ల వర్షం కురిపించిన నెటిజన్లు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత స్టార్ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోషల్ మీడియాలో అవాస్తవమైన ఒక ప్రమోషనల్ పోస్టింగ్ పెట్టి నెటిజన్లకు దొరికిపోయింది. దీంతో వారు ఆమెపై సెటైర్ల వర్షం కురిపించారు. మరికొందరు మీరు ఇలా చేస్తారా? అంటూ విమర్శించారు.

Sania Mirza promotes One Plus 3T, using her iPhone; gets trolled on Twitter

అసలు విషయానికొస్తే.. 'ఒక టెక్కీని కానప్పటికీ గత కొన్ని నెలలుగా పూర్తిగా 'వన్ ప్లస్ త్రీటి' ఫోన్‌నే వాడుతున్నాను' అని సానియా మార్జీ ట్వీట్ చేసింది. ఇదొక వాణిజ్య ప్రకటనకు సంబంధించిన పోస్టింగ్ అయినప్పటికీ చిన్న పొరపాటు జరిగింది.

Sania Mirza promotes One Plus 3T, using her iPhone; gets trolled on Twitter

ఆ ట్వీట్ కింద పోస్టింగ్ ఐఫోన్ నుంచి చేసినట్టు కనిపించింది. అయితే కొంతసేపటికి సానియా ఆ ట్వీట్‌ను తొలగించింది. అంతకుముందే ఇది గమనించిన నెటిజన్లు స్క్రీన్ షాట్లతో సానియా మీర్జాపై సెటైర్లు గుప్పించారు. ఇక చాలు ఐఫోన్ వాడుతూ అబద్ధాలు ఎందుకు చెబుతున్నావంటూ ఎద్దేవా చేశారు.

ఐఫోన్ వాడే వాళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేసే ప్రతి దానికీ అది ఐఫోన్ నుంచి పోస్టు చేశారనే సిగ్నేచర్ పడుతుందనే విషయం తెలిసిందే. సానిమా పోస్టు విషయంలోనూ అదే జరిగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Tennis player Sania Mirza posted a promotional tweet on Wednesday about the smartphone One Plus 3T. But this promotional tweet went wrong when she didn’t realise that she was making the tweet from her I-Phone. Twitteratti was quick to spot this and they didn’t really take much time to troll the tennis player.
Please Wait while comments are loading...