వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిచాయ్! ఆమె కోసమే అమ్మాయిల హాస్టల్‌కు వెళ్లే వాడట!

భారత పర్యటనలో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఖరగ్‌పూర్ విద్యార్థులతో సాంకేతిక విషయాలతోపాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

|
Google Oneindia TeluguNews

ఖరగ్‌పూర్: భారత పర్యటనలో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఖరగ్‌పూర్ విద్యార్థులతో సాంకేతిక విషయాలతోపాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. సరదా సరదాగా సాగించి ఆయన ముఖాముఖి. దాదాపు 23 ఏళ్ల తర్వాత క్యాంపస్‌లో అ డుగుపెట్టిన పిచాయ్‌ అక్కడి విద్యార్థులతో, అధ్యాపకులతో ఆప్యాయంగా మాట్లాడారు.

'తనను(భార్య అంజలి) కలవడం కోసం ఎపుడూ అమ్మాయిల హాస్టల్‌కు వెళుతుండేవాడిని. అక్కడ ఎవరో ఒకరు గట్టిగా.. 'అంజలీ.. సుందర్‌ నిన్ను పిలుస్తున్నాడు' అని పిలుస్తుంటే మాత్రం ఇబ్బందిగా ఉండేది' అని నవ్వుతూ విద్యార్థులతో చెప్పారు.

అంతేగాక, తాను గతంలో ఉన్న హాస్టల్‌ గదికి వెళ్లి కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఆయన తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 'ఎక్కువ సమయం పుస్తకాలతోనే గడిపేవాడిని. రాత్రంతా చదువుతూనే ఉండేవాళ్లం. అందుకే ఉదయం క్లాసులకు వెళ్లలేకపోయే వాళ్లం'అని విద్యార్థులకు తెలిపారు.

Shutting down the mess to college romance: Sundar Pichai revisits IIT days

కాగా, తనకు చాలా మంది హీరోయిన్లను ఇష్టపడ్డానని, అయితే, తన రూములో ఎవరి పోస్టర్ ఉన్నది మాత్రం చెప్పనని అన్నారు. 'అబే.. సాలే' అనే దాన్ని ఎపుడైనా ఎవరినైనా పిలవడానికి ఉపయోగించే పదమని మొదట్లో పొరబాటు పడ్డానని తెలిపాడు. కానీ దాని అర్థం అప్పుడు తెలియలేదని అన్నారు.

ర్యాగింగ్‌లో భాగంగా తమ సీనియర్ల సామాన్లను రైల్వే స్టేషన్‌ నుంచి కాలేజ్‌కి తీసుకువచ్చానని, తాను మొట్టమొదటి సారి కంప్యూటర్‌ను చూసింది ఐఐటీలోనే విద్యార్థులకు వివరించారు. ఆయన చెబుతున్నంత సేపు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విన్నారు.

English summary
It was homecoming for India-born Google CEO Sundar Pichai as he visited his alma mater IIT Kharagpur on Thursday. The tech giant's CEO gave a sneak peak into his college days when he met his wife Anjali and the romance blossomed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X