వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై మంత్రికి పళని హెచ్చరిక వృథా అయిందా?

తమిళనాడు డెయిరీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు, నారా బ్రాహ్మణిలు ఇప్పుడు మౌనం వహిస్తున్నారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడు డెయిరీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు, నారా బ్రాహ్మణిలు ఇప్పుడు మౌనం వహిస్తున్నారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ! చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!

తమిళనాడులో పాల విషయంలో నారా బ్రాహ్మణి చేసిన విజ్ఞప్తి, చంద్రబాబు హెచ్చరించినట్లుగా వచ్చిన వార్తలు అన్నీ వృథా అయ్యాయని అంటున్నారు.

మంత్రి ప్రభావంతో అమ్మకాలపై ప్రభావం

మంత్రి ప్రభావంతో అమ్మకాలపై ప్రభావం

తమిళనాడు మంత్రి కేఆర్ రాజేంద్ర బాలాజీ.. ప్రయివేటు పాల కంపెనీలు కల్తీ అమ్ముతున్నాయని, క్యాన్సర్ కారక రసాయనాలు కూడా కలుపుతున్నాయని కొంతకాలంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల ఫలితంగా పాల అమ్మకాలు తగ్గాయి.

రంగంలోకి దిగిన చంద్రబాబు

రంగంలోకి దిగిన చంద్రబాబు

తమిళనాడులో హెరిటేజ్ డెయిరీ అమ్మకాలు కూడా బాగా ఉంటాయి. మిగతా డైరీ కంపెనీలు సీఎం చంద్రబాబును ఆశ్రయించారని, దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి తమిళనాడు ప్రభుత్వాన్ని పాల వ్యవహారంలో కాస్త సెట్ చేశాడనే వాదనలు ఉన్నాయి.

దేవాన్ష్ కూడా ఆ పాలు తాగుతాడు

దేవాన్ష్ కూడా ఆ పాలు తాగుతాడు

నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో చెన్నై వెళ్లి పాల నాణ్యతపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు దేవాన్ష్ కూడా హెరిటేజ్ పాలే తాగుతారని చెప్పారు.

చంద్రబాబు వార్నింగ్.. బాలాజీకి పళనిస్వామి క్లాస్

చంద్రబాబు వార్నింగ్.. బాలాజీకి పళనిస్వామి క్లాస్

మరోవైపు, చంద్రబాబు నేరుగా తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి హెచ్చరిక లాంటి విజ్ఞప్తి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పళని కూడా.. మంత్రిని హెచ్చరించినట్లు ఊహాగానాలు వినిపించాయి. నాయుడు, వెంకయ్యలు కలిస్తే మన పని ప్రభుత్వం పడిపోతుందని మంత్రి రాజేంద్ర బాలాజీకి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

కోర్టుకు డెయిరీ సంస్థలు

కోర్టుకు డెయిరీ సంస్థలు

కొద్ది రోజులు బాగానే కనిపించిందని, కానీ ఆ తర్వాత అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి కూడా రాజేంద్ర బాలాజీ విషయంలో సైలెంట్ అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని డెయిరీ సంస్థలు కోర్టుకు ఎక్కాయి. కల్తీపాలు అమ్ముతున్నామని చెప్పి ఇమేజ్ చేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించాయి.

హైకోర్టు స్టే

హైకోర్టు స్టే

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని మంత్రి రాజేంద్ర బాలాజీకి హైకోర్టు సూచించింది. అనంతరం రెండు కంపెనీలత శాంపిల్స్ తీయడంపై స్టే విధించింది.

అంతకుముందే శాంపిల్స్

అంతకుముందే శాంపిల్స్

అయితే, శుక్రవారం ఇది మలుపు తిరిగింది. యూపీలోని ఘజియాబాద్ రెఫరల్ లేబరేటరీ ఇచ్చిన పాల అనాలసిస్ రిపోర్టులను మంత్రి కోర్టుకు సమర్పించాడు. నాసిరకం పాలు అని ఆ రిపోర్టులు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. నిర్దేశించిన ప్రమాణాలు లేవని చెప్పారు. కోర్టు స్టే ఇవ్వడానికి ముందే ఈ శాంపిల్స్ తీశారని చెబుతున్నారు.

English summary
Tamil Nadu Milk and Dairy Products Developments Minister Rajendra Balaji once again stirred a controversy by alleging that the products of private milk producers are adulterated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X