వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటకు బాబా.. తెర వెనుక విలాస జీవితం

బయటకి మాత్రం బాబా అవతారం. అధ్యంతం ఆధ్యాత్మిక ప్రవచనాలు. స్వచ్ఛమైన వస్త్రధారణ. నిండైన అలంకరణ. ఆకట్టుకునే హావభావాలు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

సిర్సా: బయటకి మాత్రం బాబా అవతారం. అధ్యంతం ఆధ్యాత్మిక ప్రవచనాలు. స్వచ్ఛమైన వస్త్రధారణ. నిండైన అలంకరణ. ఆకట్టుకునే హావభావాలు. చీకటి పడితే సరి ఆ అవతారం మొత్తం మారిపోతుంది. అరిషడ్వర్గాలను త్యజించాలని చెప్పే ఆ మనిషిలో రెండోకోణం బయటకు వస్తుంది. పగటిపూట శిష్యురాళ్లుగా ఉండే వారు రాత్రిపూట ఇంకో అవతారంలోకి మారిపోతారు. ఆధ్యాత్మిక గురువు మదన కామరాజుగా మారిపోతాడు. రాసలీలలు వెలగబెట్టడానికి ఓ సొరంగాన్నే ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ స్వామి వారి సత్తా ఏమిటో తెలుస్తూనే ఉన్నది. ఇదంతా హర్యానాలోని సిర్సా కేంద్రంగా ఉన్న డేరా సచ్చా సౌదా బాబా గుర్మీత్‌ రామ్‌రహీం సింగ్‌ చీకటి కోణాల్లో ఓ పర్వం ఇది.

శిష్యురాళ్లపై అత్యాచారాలకు పాల్పడి, ప్రస్తుతం 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ఈ విలాస పురుషుడి కామక్రీడలు, ఇతరత్రా నేర సామ్రాజ్య తీరుతెన్నులు చూసి దర్యాప్తు అధికారులే నిర్ఘాంతపోతున్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డేరా ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది విలాసాలకు మారుపేరుగా నిలయంగా మారింది. శనివారం పోలీసు అధికారులు జరిపిన తనిఖీల్లో రెండు సొరంగ మార్గాలు, మందుగుండు తయారీ ఫ్యాక్టరీ బయటపడ్డాయి.

Tunnel connecting Ram Rahim's 'gufa' to sadhvis' hostel found inside dera campus

'సాధ్వి నివాస్' వరకు ప్రత్యేక మార్గం

Recommended Video

Ram Rahim Use To Sell Most Expensive Vegetables In His Dera, Know Why ? | Oneindia Telugu

గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం నుంచి శిష్యురాళ్లు నివసించే 'సాధ్వీ నివాస్‌'కు రాకపోకలు సాగించడానికి వీలుగా ఫైబర్‌ సొరంగం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ 'గుహ'లోనే గుర్మీత్‌ మహిళలపై ఆకృత్యాలకు ఒడిగట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు ఫైబర్‌తో రూపొందించిన మరో గుహనూ గుర్తించారు. దానిని మట్టితో కప్పిపెట్టారు. గుర్మీత్‌ నివాసంలోకి అత్యంత సన్నిహిత అనుచరులు తప్ప మరెవ్వరికీ ప్రవేశం ఉండేది కాదు. 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న డేరా లోపల.. పేలుడు పదార్థాలు, బాణాసంచా తయారీ కోసం ఏర్పాటు చేసుకున్న అక్రమ ఫ్యాక్టరీ కూడా బయటపడింది. రసాయన పదార్థాలనూ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఏకే-47 తూటాలకు సంబంధించిన ఓ ఖాళీ అర కూడా లభించిందని అన్నారు. సోదాలు మొదలైన మొదటి రోజే నంబర్ లేని విలాసవంతమైన కారు, టీవీ ప్రసారాలకు వినియోగించే వాహనం, వాకీటాకీలు, రద్దయిన నోట్లు, ప్లాస్టిక్‌ నగదు బయటపడిన విషయం తెలిసిందే. రెండో రోజైన శనివారం వెలుగుచూసిన సొరంగంపై ఫోరెన్సిక్‌ నిపుణులు దృష్టి సారించారు. కొన్ని గదులను జప్తుచేయడంతో పాటు హార్డ్‌డిస్కులు, వివరాల్లేని మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. సోదాల ప్రక్రియను వీడియో తీస్తున్నారు.

Tunnel connecting Ram Rahim's 'gufa' to sadhvis' hostel found inside dera campus

వైద్య కళాశాల నుంచి సంజాయిషీకి ఆదేశం

డేరా తరఫున ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య 14 మృతదేహాలను లక్నోలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు అప్పగించిన తీరు కలకలం రేకెత్తిస్తోంది. మృతదేహాలను అప్పగించడానికి అనుసరించాల్సిన పద్ధతులను పాటించకపోవడంతో అసలు ఇవి ఎవరివనే సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిలో దేనికీ పోలీసు అనుమతులు, మరణ ధ్రువీకరణ పత్రాలూ లేవని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆశ్రమంలో గుట్టుచప్పుడు కాకుండా హత్యలూ జరిగేవన్న ఆరోపణలకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. మృతదేహాల వల్ల నదులు కలుషితం కాకుండా చూడడానికి తమ సభ్యులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం మేరకే వైద్య కళాశాలకు వాటిని దానం చేసినట్లు డేరా వర్గాలు చెబుతున్న మాటల్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది. మృతదేహాలను స్వీకరించిన కళాశాల నుంచి సంజాయిషీ కోరారు. భారత వైద్య మండలి (ఎంసీఐ) అధికారులు గత నెల 16న కళాశాలలో తనిఖీలు చేసినప్పుడు తొలిసారిగా ఈ విషయం బయటపడింది. జనవరి 6న ఎంసీఐ తనిఖీలు చేస్తే ఒక్క మృతదేహమే ఉండేది. కనీసం 15 ఉండాల్సిన చోట ఒకటే ఉండడమేమిటని ఎంసీఐ ప్రశ్నించింది. డేరా లోపల మరిన్ని మృతదేహాలను పాతిపెట్టారనే అనుమానాలు రావడంతో తవ్వకాల కోసం జేసీబీలూ రంగప్రవేశం చేశాయి.

Tunnel connecting Ram Rahim's 'gufa' to sadhvis' hostel found inside dera campus

సినిమా హాలు ప్లస్ స్టార్ వసతులతో రిసార్ట్ కూడా

అనేక రకాల అభిరుచులు, అలవాట్లు ఉన్న డేరా బాబా ఎంతటి విలాస పురుషుడో అతని వస్త్రశ్రేణే చెబుతోంది. తాజా సోదాల్లో వందకొద్దీ బూట్లు, డిజైనర్‌ వస్త్రాలు బయటపడ్డాయి. కొన్ని సినిమాల్లోనూ నటించిన బాబా వద్ద ఉన్న టోపీలకైతే లెక్కేలేదు. డేరాలోపల ఉన్న దుకాణాల్లో- రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన 'ఎంఎస్‌జీ' పేరుతో వినియోగవస్తువులు కనిపిస్తున్నాయి. డేరాలోపల నివాసాలు, పాఠశాలలు, క్రీడా గ్రామం, ఆసుపత్రి, వాణిజ్య సముదాయాలు, చలనచిత్ర మందిరంతో పాటు అత్యంత వైభవోపేతమైన స్టార్ వసతులతో కూడిన రిసార్టు కూడా ఉంది. దీనిలో ఈఫిల్‌ టవర్‌, తాజ్‌ మహల్‌, క్రెమ్లిన్‌, డిస్నీ వరల్డ్‌ తదితరాల నమూనాలూ కొలువుతీరాయి.

English summary
SIRSA: A tunnel and a passageway connecting Gurmeet Ram Rahim Singh's quarters to the hostel of his female disciples were on Saturday found by the security agencies during the second day of a massive sanitisation exercise inside the headquarters of his sect. An illegal fire cracker factory and chemicals were also found during the search of the premises of the dera, whose chief Gurmeet Ram Rahim Singh was jailed for 20 years in two rape cases+ last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X