వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేడా అదే!: హుందాగా జగన్.. అలిగి వెళ్లిన పవన్, ఆ పెళ్లిలో అసలేం జరిగింది?

సీఎం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ప్రాధాన్యం ఉంటుందన్న సంగతి తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పొలిటికల్ పవర్ ఈజ్ అల్టిమేట్ అన్నది వంద శాతం నిజం. పవర్‌లో ఉన్న పొలిటిషియన్ ఎక్కడికెళ్లినా తొలి ప్రియారిటీ వారికే ఉంటుంది. పవర్‌స్టార్ లైనా, సూపర్‌స్టార్ లైనా.. పొలిటికల్ పవర్ ముందు తగ్గక తప్పదు. ప్రోటోకాల్ ప్రకారం ఆవిధంగా నడుచుకోవాల్సిందే కూడా.

కానీ అలా తగ్గడం పవన్ కళ్యాణ్‌కు ఎందుకో నచ్చలేదట. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అంటూ సినిమాల్లో డైలాగ్స్ చెప్పే పవన్.. నిజ జీవితంలో ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి మాత్రం కొంచెం హర్ట్ అయ్యారట. అందుకే కారు కూడా దిగకుండానే వచ్చిన దారిలో వచ్చినట్లే మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడట.

అసలేం జరిగింది?:

అసలేం జరిగింది?:

ఎన్టీవి ఛైర్మన్ నరేంద్ర చౌదరి కూతురి వివాహానికి చాలామంది వివిఐపీలు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. సీఎం కాన్వాయ్ వస్తుందంటే సహజంగానే ఇతరుల వాహనాలను నిలిపివేయడం కామన్. అందులోను సీఎం కేసీఆర్ కాన్వాయ్ దేశంలోనే అందరు సీఎంల కన్నా పెద్దది. దీంతో ప్రోటోకాల్ ప్రకారం ఆ దారిలో వచ్చే కార్లన్నింటిని ఆపేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత జగన్ కూడా వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

అలిగి వెళ్లిపోయిన పవన్:

అలిగి వెళ్లిపోయిన పవన్:

కేసీఆర్ కాన్వాయ్ వస్తుండటంతో పవన్ కారు కూడా రోడ్డుపై నిలిచిపోక తప్పలేదు. అయితే పవన్ మాత్రం దీన్ని ఇబ్బందికి ఫీలయ్యారట. ఒకింత అలిగిన పవన్.. అదే దారిలో తిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు. అలా పెళ్లి కోసం వచ్చిన పవన్.. పెళ్లి మంటపంలోకి కూడా రాకుండానే వెనుదిరిగారట.

హుందాగా జగన్:

హుందాగా జగన్:

పవన్ అలిగి వెనక్కి వెళ్లిపోతే.. జగన్ మాత్రం హుందాగా వ్యవహరించారని చెబుతున్నారు. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లేవరకు వేచి చూసి.. ఆపై ఆయన పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు. సీఎం హంగామా ముగిసిన తర్వాతే వెళ్లడం బెటర్ జగన్ కూడా భావించి ఉండవచ్చు. అలా కేసీఆర్ తర్వాత పెళ్లి మంటపంలోకి వచ్చిన జగన్‌కు అతిథి మర్యాదలు బాగానే దక్కాయి.

పవన్ అది గమనించలేదేమో?:

పవన్ అది గమనించలేదేమో?:

నిజానికి కేసీఆర్ స్థానంలో చంద్రబాబు ఉన్నా పోలీసులు అలాగే చేస్తారు. ముందు వాళ్ల కాన్వాయ్ ను అనుమతించిన తర్వాతే వేరెవరిదైనా అనుమతిస్తారు. అంతదాకా ఎదురుచూడటం మినహా చేసేదేమి ఉండదు.

అంతెందుకు.. ఇటీవలే గవర్నర్ నరసింహన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్‌ను కూడా పిలిచాడు. సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో సమానంగా పవన్ ను కూడా కూర్చోబెట్టాడు. ఆ సమయంలో కేసీఆర్ గానీ, చంద్రబాబు గానీ అభ్యంతర పెట్టలేదు. ఎవరూ అలగలేదు. మరెందుకు పవన్ మాత్రం.. ఇలాంటి వాటిని ఇంతగా పట్టించుకోవాలి? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం స్థాయి వ్యక్తి వస్తున్నప్పుడు కాసేపయినా వేచి చూసే ఓపిక లేకపోతే ఎలా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

English summary
An interesting incident happened NTV Chairman Narendra Chowdary daughter's wedding ceremony. Pawan Kalyan left from the wedding after KCR came to there
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X