వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిరాకిల్: భర్త చనిపోయిన రెండేళ్లకు.. అతని బిడ్డకు తల్లి అయిన భార్య

భర్త చనిపోయిన రెండేళ్ల తర్వాత అతని బిడ్డకు భార్య జన్మనిచ్చింది.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచ వైద్యశాస్త్రంలో మరో అరుదైన అద్భుతం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండేళ్ల తర్వాత అతని బిడ్డకు భార్య జన్మనిచ్చింది. న్యూయార్క్ లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రి ఇందుకు వేదికైంది.

వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 2014లో న్యూయార్క్ పోలీసు అధికారి వెంజియాన్ లియూ, అతని సహ అధికారి రఫాలే రామోస్ లతో కలిసి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న వేళ.. కొంతమంది నిరసనకారులు వారిపై దాడి చేసి హత్య చేశారు.

లియూ చనిపోయిన రోజు రాత్రి అతని భార్య చెన్ వైద్యులను సంప్రదించింది. తన భర్త వీర్యాన్ని భద్రపరచడం ద్వారా తనకు భవిష్యత్తులో పిల్లలు కలిగేలా చేయాలని కోరింది. లియూతో కలిసి పిల్లలను కనాలన్న కోరికను ఈవిధంగా తీర్చుకోవాలనుకుంది.

Wife of an NYPD officer who was ambushed and killed in 2014 just gave birth to their daughter

చెన్ కోరిక మేరకు ప్రెస్బిటేరియన్ ఆసుపత్రి వైద్యులు మృతదేహం నుంచి వీర్యాన్ని సేకరించి భద్రపరిచారు. అలా రెండున్నరేళ్ల తర్వాత చెన్ లియూ బిడ్డకు తల్లి అయింది. మంగళవారం నాడు ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్త మృతదేహం నుంచి తీసిన వీర్యంతో కృత్రిమ గర్భదారణ పద్ధతుల ద్వారా ఆమె గర్భం దాల్చింది.

ఇదిలా ఉంటే, విధుల్లో ఉండగా మరణించిన తొలి ఆసియన్ అమెరికన్ పోలీస్ అఫీసర్ గా లియో నిలిచిపోయారు. అతని అంత్యక్రియలు అప్పట్లో ఘనంగా నిర్వహించారు.

English summary
Many people saw Pei Xia Chen for the first time at one of her most difficult moments.In December 2014, her husband, New York City police officer Wenjian Liu, and his partner, Rafael Ramos, were ambushed and killed in their patrol car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X