వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీతో జగన్ ‘మై హోం’ మధ్యవర్తిత్వం? వేమూరితో కూడా?!

తెలుగునాట సరికొత్త రాజకీయాలకు తెర తీయనున్నారా? అంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. టీఆర్ఎస్ - టీడీపీ మధ్య పొత్తు పొడవనున్నదని వార్తలొస్తుండగా, మరోవైపు ఏపీలో విపక్ష నేత జగన్మోహన రెడ్డి మీడియా సంస్థల అధినేత

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిలో మార్పు కాన వస్తున్నదా? వైఖరి మార్చుకుంటున్నారా? ఒక అడుగు వెనుకడుగు వేస్తున్నారా? అన్న సందేహం వ్యక్తం అవుతున్నది. త్వరలో ఆంధ్రజ్యోతి సీఎండీ వేమూరి రాధాకృష్ణతో సమావేశం వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పాదయాత్రకు ఆశీస్సులు అందించాలని కోరుతూ ఆయన ఈనాడు అధినేత సీహెచ్ రామోజీరావు సమావేశమై సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీనిపై ఆత్మరక్షణ ధోరణి ప్రదర్శిస్తున్నారు. రామోజీరావుతో జగన్మోహన్ రెడ్డి సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. తాను త్వరలో చేపట్టబోయే పాదయాత్రకు మీడియాలో ప్రాధాన్యం కల్పించాలని కోరడానికే రామోజీరావును ఆయన కలిశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

Recommended Video

YS Jagan tour in districts instead of Padayatra? పాదయాత్రపై జగన్ రివర్స్ గేర్ | Oneindia Telugu
 జగన్మోహనరెడ్డికి ప్రశాంత్ కిశోర్ ఇలా సలహా

జగన్మోహనరెడ్డికి ప్రశాంత్ కిశోర్ ఇలా సలహా

ఇప్పటివరకు ఆయన సొంత పత్రిక ‘సాక్షి'తోపాటు అవసరమైనప్పుడు జాతీయ మీడియాతో తప్ప స్థానిక మీడియాకు జగన్మోహనరెడ్డి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు దాదాపుగా లేవు. కానీ స్థానిక, జాతీయ మీడియాను దూరం పెట్టొద్దని వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆయన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ సూచించారు. పొలిటికల్ మేనేజ్మేంట్‌లో స్థానిక, జాతీయ మీడియా యాజమాన్యాలతో అనుబంధం పెంచుకోవాలని సలహా ఇచ్చారని వినికిడి. రాజకీయాల్లో పాదయాత్ర చేసినప్పుడు, ఎన్నికల్లో ప్రత్యేకించి మీడియా అధినేతలతో వ్యూహాత్మకంగా సమావేశం కావాలని ఆయన సూచించారని తెలుస్తోంది. అప్పుడే ఆయన రాజకీయ వ్యవహారాలపై సీరియస్‌గా ద్రుష్టి పెడతారని సమాచారం.

త్వరలో మీడియా సంస్థల అధినేతలతో భేటీ?

త్వరలో మీడియా సంస్థల అధినేతలతో భేటీ?

రాజకీయాలకు అతీతంగా పనిచేసే మీడియా సంస్థలతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఎడిటర్లు, సీనియర్ విలేకరులతో సమావేశమై చర్చల ద్వారా సానుకూలంగా వ్యవహరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. తాజాగా మారిన రాజకీయ వ్యూహానికి అనుగుణంగానే రామోజీరావుతో జగన్మోహనరెడ్డి సమావేశమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తదుపరి దశలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు, యజమానులతో సమావేశం కానున్నారని రామోజీరావుతో రహస్య అవగాహన కలిగి ఉన్నారని వదంతులు వచ్చాయి. తాజాగా ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సమావేశం అవుతారా? సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం.. ‘ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో మాత్రమే కాదు. టీవీ 9 సీఈఓ రవిప్రకాశ్, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, టీవీ 5 చీఫ్ బీఆర్ నాయుడులతోనూ వైఎస్ జగన్మోహన రెడ్డి సమావేశం అవుతారు' అని తెలిపాయి.

ఆసుపత్రిలో రామోజీని పరామర్శించిన జగన్

ఆసుపత్రిలో రామోజీని పరామర్శించిన జగన్

ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య తొలిసారి సంప్రదింపులు చాలా మందిని ఆశ్చర్యచకితులను చేయడమే కాదు దిగ్భ్రాంతి కలిగించాయి. కానీ ఇటీవల వారిద్దరి భేటీ ఎటువంటి సంత్రుప్తిని ఇవ్వలేదు. వారిద్దరూ సినీ నటుడు మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు మనోజ్ వివాహ సమయంలో తొలిసారి 2015 మే 20వ తేదీన బహిరంగంగా వారిద్దరూ ఇష్టాగోష్టిగా చిట్ చాట్ చేశారు. తర్వాత రెండుసార్లు రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో వైఎస్ జగన్మోహన రెడ్డి సమావేశం అయ్యారు. అప్పుడప్పుడు వివిధ సందర్భాల్లో పరస్పరం పలుకరించుకుంటున్నారు. రామోజీరావు గత ఏడాది అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు జగన్ వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్మోహనరెడ్డికి ముందు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఈనాడు అధినేత రామోజీరావుతో ఉన్న వైరం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బద్ధ శత్రువుగా పరిగణించే రామోజీరావుతో జగన్ రాజీ పడుతున్నారా? దీనికి బలమైన కారణాలు ఉన్నాయా? అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రామోజీరావు, జగన్ మధ్య రాజీ కుదిర్చేందుకు ఒక రెడ్డి సామాజిక వర్గ నేత, మరో కమ్మ సామాజిక వర్గ నాయకుడు మధ్యవర్తిత్వం వహించారా? అన్న సందేహాలు వినిపించాయి.

 రామోజీ - జగన్ మధ్య ‘మైహోం' మధ్యవర్తిత్వం

రామోజీ - జగన్ మధ్య ‘మైహోం' మధ్యవర్తిత్వం

కానీ తెలంగాణలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త - మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఈనాడు అధినేత రామోజీరావు, జగన్ మధ్య మధ్యవర్తిత్వం వహించారని సమాచారం. అంతకుముందు రామోజీరావు, ప్రస్తుత సీఎం - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మధ్య కూడా రామేశ్వరరావు రాజీ కుదర్చడంలో విజయవంతం అయ్యారు. రామేశ్వరరావుకు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్‌తో సన్నిహిత సంబంధాల వల్లే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్ నగర శివారుల్లోని రాయదుర్గం భూ వివాదంపై మై హోం అధినేత రామేశ్వరరావును వేధించారని విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్ కుటుంబంతో సత్సంబంధాలే జగన్మోహనరెడ్డిని రామోజీరావుకు దగ్గర చేయాలని రామేశ్వరరావు సంకల్పించారు. ఇటీవల రామోజీరావుతో జరిగిన భేటీకి వెళ్లిన జగన్మోహన రెడ్డి వెంట కూడా రామేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని పార్టీ వర్గాల కథనం.

వైఎస్ జగన్ వ్యూహం ఇలా

వైఎస్ జగన్ వ్యూహం ఇలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను నిత్యం అత్యంత సన్నిహితంగా పరిశీలించే వారు వైఎస్ జగన్మోహన రెడ్డి అడుగులను కనిపెట్టడంలో విఫలం అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. సాక్షి తప్ప ఏ ఇతర తెలుగు మీడియా సంస్థకూ వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలు లేవు. పరిణామాలన్నీ సజావుగా సాగితే త్వరలో రామోజీరావు సారథ్యంలోని ‘ఈటీవీ'లో తొలుత వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ప్రసారం కానుండటమే దీనికి కారణమని చెప్తున్నారు. త్వరలో ఆయన పాదయాత్ర చేపట్టడానికి ముందు ఈ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుందని సమాచారం. కానీ ఇది ఆశ్చర్యకర పరిణామమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ ‘ఈటీవీ'లో జగన్మోహనరెడ్డి ఇంటర్వ్యూ ప్రసారమైతే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడి నిజమేనని మరోసారి రూడీ అవుతుంది.

English summary
After YSR Congress party president Y S Jaganmohan Reddy met Eenadu group chairman Ch Ramoji Rao a couple of days ago to seek the latter’s blessings for the success of his marathon padayatra commencing on November 6, the party leaders went on defensive. Party sources say there is no political significance to Jagan meeting Ramoji and that it is just part of seeking the support of media for giving extensive coverage to his padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X