వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ మానస సరోవర యాత్ర: జగన్ పట్టించుకోలేదా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మానస సరోవర యాత్ర చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మానస సరోవర యాత్ర చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఆమె చేతిలో నిత్యం బైబిల్ ఉంటుంది. అలాంటి విజయమ్మ ఈ వయస్సులో తన సోదరుడితో కలిసి కఠినమైన హిమాలయ యాత్రకు పూనుకొని, ఏకంగా మానస సరోవర యాత్ర చేశారని అంటున్నారు.

సభలో మళ్లీ విభజన బిల్లు, బాబు వల్లే మా సభ సక్సెస్: కేవీపీ ట్విస్ట్సభలో మళ్లీ విభజన బిల్లు, బాబు వల్లే మా సభ సక్సెస్: కేవీపీ ట్విస్ట్

తమ్ముడు, మరికొందరితో కలిసి ఆమె ఈ యాత్ర చేశారని అంటున్నారు. అయితే ఈమె ఇలా చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. చివరకు జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో కూడా రాలేదంటున్నారు.

YS Vijayamma Manasa Sarovar yatra with brother

జగన్ ఫ్యామిలీ ఆయన తాత కాలం నాడే క్రైస్తవాన్ని స్వీకరించింది. వైయస్ హయాంలో హైదరాబాదులోని కోఠి సెంటర్లో వేకువజామున గుడి కూల్చడం, తిరుమల శ్రీవారి కొండలను తగ్గించే ప్రయత్నాలు చేయడంతో.. ఓ వర్గం వారికి దూరంగా జరిగిందనే వాదనలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో జగన్‌కు ఇది మైనస్ అయిందని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఇటీవల రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. పుష్కరాల్లో స్నానం చేయడం, శ్రీవారిని దర్శించుకోవడాలు చేస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే విజయమ్మ మానస సరోవర యాత్ర చేసిందంటే మరింత ఎఫెక్ట్ కనిపిస్తుందని, కానీ దానిని వైసిపి తమ సాక్షి పత్రిక ద్వారా ఎందుకు రాజకీయంగా ఉపయోగించుకోవడం లేదనే చర్చ సాగుతోంది.

వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. కానీ ఇటీవల ప్రతి విషయాన్ని రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అలాంటిది విజయమ్మ మానస సరోవర యాత్ర చేస్తే ఎందుకు ఉపయోగించుకోలేదనే చర్చ సాగుతోంది.

English summary
It is said that YSR Congress Party leader YS Vijayamma went for Manasa Sarovar yatra with brother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X