వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ సిట్టింగ్‌లలో ఆందోళన: ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు?

క్షేత్రస్థాయిలో గెలిచే పరిస్థితులు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ వైసీపీ చీఫ్ జగన్ కు సూచించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: క్షేత్రస్థాయిలో గెలిచే పరిస్థితులు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ వైసీపీ చీఫ్ జగన్ కు సూచించాడు.అయితే గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లను కేటాయించనున్నట్టు ఆయన కూడ సంకేతాలను ఇచ్చారు. అయితే సీట్లు గల్లంతయ్యేవారేవరనే భయం సిట్టింగ్‌లలో నెలకొంది.పార్టీ నాయకుల్లో ప్రస్తుతం ఇదే హట్ టాపిక్‌గా మారింది.

2019 ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాల్సిన అవసరం వైసీపీకి నెలకొంది.దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్ ను ఆ పార్టీ నియమించుకొంది.

Recommended Video

YS Jagan Confusing About Political Strategist Prashant Kishor

అయితే ప్రశాంత్‌కిషోర్ సూచనలమేరకు జగన్ ఇక ప్రతి అడుగు వేయనున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇందులో భాగంగానే రానున్న ఎన్నికల్లో గెలిచేవారికి టిక్కెట్లను కేటాయించనున్నట్టు జగన్ పార్టీ సీనియర్లు, జిల్లాల సమన్వయకర్తల సమావేశంలో తేల్చిచెప్పారు.

ఈ నెల 8,9 తేదిల్లో నిర్వహించే ప్టీనరీ సమావేశంలో క్షేత్రస్థాయలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ప్రశాంత్‌కిషోర్ నివేదికను ఇవ్వనున్నారు.అంతేకాదు ఈ నివేదిక ఆధారంగా ఆయా జిల్లాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకొనే పరిస్థితి కన్నిస్తోంది.

ఆ జాబితాలో ఎవరెవరున్నారు?

ఆ జాబితాలో ఎవరెవరున్నారు?

వైసీపీ విజయం సాధించిన సీట్లలో రానున్న ఎన్నికల్లో సీట్లు గల్లంతయ్యే ఎమ్మెల్యేలు ఎవరనే విషయమై ప్రస్తుతం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్లీనరీ సమావేశంలో ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాథమికి సమాచారం ఆధారంగానే 25 మంది సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతు కానున్నాయి. అయితే ఆ జాబితాలో ఎవరెవరున్నారనే విషయమై ఎమ్మెల్యేలు ఆరాతీస్తున్నారు. జగన్‌తో జరిగిన సమావేశానికి హజరైన నాయకులతో ఈ విషయమై ఎమ్మెల్యేలు ఆరాతీస్తున్నారు. ప్రాథమిక సర్వే నివేదికలో పొందుపర్చిన అంశాలేమిటనే విషయమై తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇధే హట్ టాపిక్

ఇధే హట్ టాపిక్

నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఈ సమావేశానికి హజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించారు. అయితే ప్రశాంత్‌కిషోర్ సర్వే నివేదిక ఆధారంగా మంచి మార్కులు వచ్చిన వారికే రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నాయకులు అంటున్నారు. గెలిచేవారికే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. 2014 ఎన్నికల్లో కొందరు సిట్టింగ్‌లకు టిక్కెట్లను కేటాయించడం వల్ల పార్టీ నష్టపోయిన విషయాన్ని ప్రశాంత్‌కిషోర్ ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు సమాచారం.

ప్రతి ఎన్నికల్లో ఓటర్ల తీర్పులో మార్పులు

ప్రతి ఎన్నికల్లో ఓటర్ల తీర్పులో మార్పులు

ప్రతి ఎన్నికల్లో ఓటర్ల తీర్పులో మార్పులు చోటుచేసుకొన్న విషయాలను ప్రశాంత్‌కిషోర్ పార్టీ నాయకులకు వివరించినట్టు సమాచారం. నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ గెలుచుకొంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి 2014 కంటే ముందు జరిగిన ఉపఎన్నికల్లో 3 లక్షల ఓట్లతో విజయం సాధించారు. కానీ, 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన కేవలం 14 వేల ఓట్లతోనే విజయం సాధించారు. కోవూరు ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన 20 వేల ఓట్లతో విజయం సాధించారు. కానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తిరుపతి ఎంపీగా వరప్రసాద్, ఆత్మకూర్ నుండి మేకపాటి గౌతంరెడ్డి, నెల్లూరు రూరల్ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , సుళ్ళూరుపేట, కావలి, నెల్లూరు సిటీ , గూడూరు నుండి వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించిరు. అయితే ఆనాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా వచ్చిందని రాజకీయపరిశీలకులు అంటున్నారు.

కొరవడిన సమన్వయం

కొరవడిన సమన్వయం

వైసీపీలో కొందరు నాయకుల మధ్య సమన్వయం లేని కారణం కూడ ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం కన్పిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి వర్గీయుల మధ్య సఖ్యత లేదు. ఈ ప్రభావం పార్టీపై తీవ్రంగా కన్పించే అవకాశం కన్పిస్తోంది.అంతేకాదు ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.అయితే ఆయా నియోజకవర్గాల్లో పార్టీని సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగా నాయకత్వాన్ని తయారుచేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. ఆ పార్టీకి గట్టిపట్టున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడ ముఖ్యనాయకుల మధ్య సమన్వయం లేకపోకవడం కూడ ప్రధానంగా ఇబ్బందిగా మారే అవకాశాలున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికలనాటికి పరిస్థితుల్లో మార్చుకొంటే ఆశాజనజనకమైన ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి.

English summary
Ysrcp Sitting MLA's anxity for tickets in 2019 elections. Who will missing tickets in 2019 elections. sitting Mla's enquiry with party leaders who attend Prahant kishor meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X