వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై చంద్రబాబు అసహనం, రంగంలోకి వెంకయ్య నాయుడు, హామీ?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఇద్దరు కలిసి తొలుత గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి జేకేసీ కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొనేందుకు ఒకే వాహనంలో వచ్చారు.

Recommended Video

Chandrababu & M Venkaiah Naidu @ Golden Jubilee Celebrations

అయితే అప్పటికే మధ్యాహ్నం కావడంతో ఇద్దరు కలిసి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఇక్కడ ఇరువురు నేతలు ఇరవై నిమిషాల పాటు చర్చించుకున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై టీడీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి వచ్చి వెంకయ్య.. చంద్రబాబుతో కాసేపు మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వెంకయ్యను రంగంలోకి దింపారా?

వెంకయ్యను రంగంలోకి దింపారా?

బడ్జెట్ కేటాయింపులపై వీరి భేటీలో చర్చకు వచ్చిందని భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారా అనే చర్చ సాగుతోంది. జేకేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య మాట్లాడుతూ.. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని చెప్పారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు సాయం అందిస్తూనే ఉంటానని చెప్పారు.

బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్

ఏపీకి హామీ

ఏపీకి హామీ


ఏపీకి అన్యాయం జరగకుండా చూస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. బహిరంగంగా ఏపీకి, బాబుతో భేటీ సమయంలో ఆయనకు ధైర్యం చెప్పి ఉంటారని, బీజేపీ ఆయనను రంగంలోకి దింపి ఉంటుందని భావిస్తున్నారు.

చంద్రబాబు వెళ్లి మోడీతో మాట్లాడుకోవాలి

చంద్రబాబు వెళ్లి మోడీతో మాట్లాడుకోవాలి

బడ్జెట్‌లో కేటాయింపులపై ఏపీ అసంతృప్తిపై సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్పందించారు. ఏపీకి నిధుల విషయంలో చంద్రబాబు నాయుడు వెళ్లి ప్రధాని మోడీతో మాట్లాడాలని సూచించారు. కేంద్రం ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్‌కు నిధులు రాకపోవడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని చెప్పారు.

జగన్ దెబ్బ, బాబు డైలమా.. బడ్జెట్‌పై ఇదీ వ్యూహం! అశోక్-సుజనల రాజీనామా, ట్విస్ట్జగన్ దెబ్బ, బాబు డైలమా.. బడ్జెట్‌పై ఇదీ వ్యూహం! అశోక్-సుజనల రాజీనామా, ట్విస్ట్

తెగదెంపులు తొందరపాటు

తెగదెంపులు తొందరపాటు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెగదెంపులు అనే విషయమై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. అది తొందరపాటు అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆందోళన తమ పార్టీ సమావేశాల్లో ప్రతిఫలిస్తుందని చెప్పారు.

English summary
AP CM Chandrababu finds himself in a unenviable situation. Breaking away from the NDA alliance also in not an easy option, given the disarray in the Opposition and his stated anti-Congress stand. The surveys showing high popularity of Narendra Modi and lack of assertive leaders among the regional parties are not encouraging news either.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X