వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షేమ్.. షేమ్: నటి శ్రీదేవి మృతిపై కాంగ్రెస్, అవమానం... నెటిజన్ల ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

Recommended Video

షేమ్.. షేమ్... నటి శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ రాజకీయం! | Oneindia Telugu

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి శ్రీదేవి మృతిపై పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె హఠాన్మరణంపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపింది.

అయితే, కాంగ్రెస్ పార్టీ చేసిన పూర్తి ట్వీట్ చదివిన తర్వాత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడటంతో ఆ ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. శ్రీదేవి మృతికి సంతాపం తెలపడం ఓకే.. కానీ తామే అవార్డు ఇచ్చామని ప్రకటించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.

శ్రీదేవి కన్నుమూత: అతిలోకసుందరికి ఎన్నో అవార్డులు, షూటింగ్‌లో కూతురు! శ్రీదేవి కన్నుమూత: అతిలోకసుందరికి ఎన్నో అవార్డులు, షూటింగ్‌లో కూతురు!

కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌లో ఏముందంటే

కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌లో ఏముందంటే

శ్రీదేవి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, తన నటనతో అందరి గుండెల్లో నిలిచిపోయారని, ఆమె మృతికి తమ ప్రగాఢ సానుభూతి అని ఆ పార్టీ చేసిన ట్వీట్‌లో ఉంది. ఆ తర్వాత ఆమెకు వచ్చిన పద్మ అవార్డు గురించి పేర్కొనడం గమనార్హం. 2013లో యూపీఏ హయాంలో ఆమెకు పద్మశ్రీ వచ్చిందని పేర్కొన్నారు.

బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)

ఈ కారణంతో నెటిజన్ల ఆగ్రహం

ఈ కారణంతో నెటిజన్ల ఆగ్రహం

ఓ వైపు ఆమె చనిపోయి, దుఃఖం లేదా అభిమానులు, అందరూ విచారంలో ఉన్న సమయంలో తమ హయాంలో శ్రీదేవికి పద్మశ్రీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం విచారకరమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హయాంలో పుట్టి, బీజేపీ హయాంలో మృతి

కాంగ్రెస్, రాహుల్ గాంధీలు ఇలాంటి సమయంలో నిజంగానే మానత్వంతో ట్వీట్ చేశారా అని ఓ ట్విట్టరిటీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇలా ట్వీట్ చేయడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. శ్రీదేవి కాంగ్రెస్ హయాంలో జన్మించి, బీజేపీ హయాంలో మృతి చెందిందని, ఇది మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్‌కు నిదర్శనం అని కాంగ్రెస్ చెబుతుందేమోనని మరొకరు ట్వీట్ చేశారు.

ఇదీ కాంగ్రెస్ తీరు

సందీప్ ఘోస్ స్పందిస్తూ.. మేమే ఇచ్చామన్నట్లుగా చెబుతున్నారని, కానీ పద్మ అవార్డులు భారత ప్రభుత్వం సిటిజన్లకు ఇస్తుందని, కానీ ఓ రాజకీయ పార్టీ ఇవ్వదని, దీనిని బట్టి కాంగ్రెస్ తీరు అర్థమవుతోందని పేర్కొన్నారు.

ఇది తీవ్ర అవమానకరం

ఇది తీవ్ర అవమానకరం

కార్తీక్ స్పందిస్తూ.. సంతాప సందేశంలో ఇలాంటిది చెప్పడం అవసరమా అని ప్రశ్నించారు. రవీంద్ర జడెజా అనే నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి సమయంలో రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు. మాననత్వం లేకుండా మాట్లాడుతున్నారని, ఇది తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌పై నిప్పులు

కాంగ్రెస్‌పై నిప్పులు

కాంగ్రెస్ నేత ప్రధానిగా ఉన్నప్పుడు పుట్టిన శ్రీదేవి, బీజేపీ హయాంలో మృతి చెందిందని చెప్పలేదని ఒకరు, కాంగ్రెస్ పేర్కొన్న దాంట్లో చిన్న కరెక్షన్ అని, శ్రీదేవికి పద్మశ్రీ భారత ప్రభుత్వం ఇచ్చిందని, యూపీఏ ప్రభుత్వం కాదని, రాజకీయం సరికాదని మరొకరు, శ్రీదేవికి పద్మశ్రీ ఇచ్చారు కాబట్టి మనమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నమాట, యూ స్టూపిడ్, ఇచ్చింది కేంద్రం అని ఇంకొకరు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Bollywood actor Sridevi passed away after a massive cardiac arrest on Saturday (February 24) night. The actor was 54 and was in Dubai, attending the wedding of Mohit Marwah with husband Boney and younger daughter Khushi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X