వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ప్రపంచ వినాశనానికి రెండు నిమిషాలే, డూమ్స్‌డే క్లాక్‌లో టైమ్ మార్పు

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డూమ్స్‌డే క్లాక్‌లో నిమిషాల ముల్లును మరో 30 సెకన్ల ముందుకు జరిపారు ప్రపంచ వినాశం అత్యంత దగ్గర పడుతోందనేందుకు నిదర్శనంగా నిమిషాల ముల్లును 30 సెకన్లు ముందుకు జరిపారు. డూమ్స్‌ డే గడియారం ప్రకారం 12 గంటల సమయాన్ని వినాశనానికి గుర్తుగా భావిస్తారు.

ప్రపంచ వినాశనానికి రెండు నిమిషాల దూరంలో మనం ఉన్నామనే గుర్తుగా డూమ్స్‌డే గడియారాన్ని నిర్వహిస్తారు డూమ్స్‌డే గడియారాన్ని 1947లో ఏర్పాటు చేశారు.

మానవాళి మతిలేని చర్యల వల్ల ప్రపంచ వినాశనానికి దగ్గరగా చేరుతున్నాయనే హెచ్చరికలను జారీ చేసిందుకే డూమ్స్ డే గడియారాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ నాశనాన్ని డూమ్స్ డే గడియారం ద్వారా హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

 డూమ్స్ డే గడియారం ఎందుకు ఏర్పాటు చేశారు

డూమ్స్ డే గడియారం ఎందుకు ఏర్పాటు చేశారు

రెండో ప్రపంచ యుద్ద సమయంలో డూమ్స్‌డే గడియారాన్ని ఏర్పాటు చేశారు. అణ్వాయుధాలను తయారు చేసిన మాన్‌హట్టన్ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన అమెరికా సైంటిస్టులు 1945లో బులెటిన్ ఆప్ ద అటామిక్స్ సైంటిస్ట్‌ జర్నల్‌ను ప్రారంబించారు.ఈ జర్నల్‌ను నిర్వహించే శాస్త్రవేత్తలే డూమ్స్‌డే గడియారం విధానాన్ని ఏర్పాటు చేశారు.

వినాశనాన్ని డూమ్స్‌డే వాచ్ ద్వారా హెచ్చరికలు

వినాశనాన్ని డూమ్స్‌డే వాచ్ ద్వారా హెచ్చరికలు

అణ్వాయుధాలు, అణు యుద్ధాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రమే డూమ్స్‌డే గడియారం ద్వారా హెచ్చరించేవారు. ఆ తర్వాత 2007 నుంచి వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును కూడా దీని ద్వారా హెచ్చరిస్తున్నారు.

 డూమ్స్‌డే వాచ్‌లో 20 సార్లు టైమ్ మార్పు

డూమ్స్‌డే వాచ్‌లో 20 సార్లు టైమ్ మార్పు

1947 నుంచి ఇప్పటి వరకు ఈ గడియారంలో సమయాన్ని 20 సార్లు మార్చారు. మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దానిని బట్టి సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తూ ఉంటారు. 1991లో అమెరికా, సోవియట్‌ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక గడియారంలో సమయాన్ని రాత్రి 11.43కు మార్చారు.

 వినాశనానికి దగ్గరలో

వినాశనానికి దగ్గరలో

అణ్వాయుధాలు, వాతావరణ మార్పులకు సంబంధించి రేకెత్తుతున్న ఆందోళనలపై ప్రపంచ దేశాల అధినేతలు సరైన విధంగా స్పందించడం లేదంటూ ఈ నెలలో సమయాన్ని 11.58కి మార్చారు. ఉత్తర కొరియాపై అణు దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్‌ పరోక్షంగా ప్రకటించడం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడం తదితరాలను ఇందుకు కారణాలుగా భావించవచ్చు.ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1953లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడాది అమెరికా, సోవియట్‌ యూనియన్‌లు హైడ్రోజన్‌ బాంబులు పరీక్షించడంతో సమయాన్ని 11.58కి మార్చారు.

English summary
The Doomsday Clock which symbolises the current threat of global annihilation, was moved closer to midnight Thursday following a year of growing tensions between North Korea and the Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X