వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జంప్ చేసి కష్టాలు: ఎంపీ బుట్టా రేణుకకు పదవీ గండం?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్నూలు లోకసభ సభ్యురాలు బుట్టా రేణుకు పదవీ గండం ఉందనే వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి లోకసభకు గెలిచిన ఆమె ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Recommended Video

Butta Renuka : బుట్టా రేణుక అనధికార టిడిపి చేరిక : Exclusive video | Oneindia Telugu

అయితే, ఆమెకు కష్టాలు తప్పవని అంటున్నారు. ఎంపీగా ఉంటూ మరో లాభదాయక పదవిని అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి. పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఆ విషయాన్ని నిర్ధారించినట్లు వార్తలు వచచ్చాయి.

అది ఇలా జరిగింది

అది ఇలా జరిగింది

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సిఎస్‌డబ్ల్యుబీ) జనరల్ బాడీలో ఒక చైర్ పర్సన్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరితో పాటు లోకసభ నుంచి బుట్టా రేణకను, రావత్‌లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా సంక్షేమ శా 2016 జులై 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆ విషయం ఇలా తేలింది

ఆ విషయం ఇలా తేలింది

అవి లాభదాయకమైన పదవులని పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో తేలింది. దీంతో బోర్డు సభ్యులుగా ఉన్న ఎంపీలపై అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేసింది. దీనికి ముందు ఆ విషయంపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా స్థాయీ సంఘం కోరింది. దీంతో బుట్టా రేణుక చిక్కుల్లో పడినట్లే.

ప్రభుత్వమే నియమించిందని...

ప్రభుత్వమే నియమించిందని...

ప్రభుత్వమే తమను బోర్డులో నియమించిందని, తాను గానీ, తన పార్టీ గానీ బోర్డులో నియమించాలని విజ్ఞప్తి చేయలేదని ఎంపీ బుట్టా రేణుక తమతో అన్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. తనపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని కమిటీ చేసిన సిఫార్సు గురించి తనకు తెలయదని ఆె అన్నారు.

అలా జరుగుతుందని...

అలా జరుగుతుందని...

మామూలుగా ప్రతి బోర్డులోనూ ఇద్దరు ఎంపీలను ప్రభుత్వమే నియమిస్తుందని, బర్డు జీతభత్యాలు ఏమీ చెల్లించదని, గతంలో తనను జట్ బోర్డులో నియమించారని బుట్టా రేణుక అన్నారు. ఇటీవలల ఆరోగ్య శాఖ బోర్డులో సభ్యురాలిగా నియమించిందని అన్నారు. ప్రస్తుతం సభ్యురాలిగా ఉన్న సిఎస్‌డబ్ల్యూబీ నుంచి తొలగించి కొత్త బోర్డులో నియమించారా, రెండింటిలోనూ కొనసాగుతున్నానా అనే విషంపై తనకు స్పష్టత లేదని అన్నారు.

English summary
Kurnool MP Butta Renuka is in trouble with standing committee recomadation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X