వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో నీరవ్ మోడీ? మన్‌హట్టన్‌లోని లగ్జరీ సూట్‌లో భార్యతో, అంబానీతో కనెక్షనేంటి?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,346 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ న్యూయార్క్‌లో ఉన్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఆయనొక్కరే కాదు, ఆయనతోపాటు ఆయన భార్య అమీ కూడా న్యూయార్క్‌లోనే ఉన్నారని, మన్‌మట్టన్‌లోని ఓ లగ్జరీ సూట్‌లో వారు ఉన్నారని సమాచారం. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ దావోస్ పర్యటనలో కూడా నీరవ్ కనిపించారని, మరోవైపు ముఖేష్ అంబానీతో ఆయనకు సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

న్యూయార్క్‌లో నీరవ్ మోడీ!?

న్యూయార్క్‌లో నీరవ్ మోడీ!?

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,346 కోట్లకు ముంచేసి ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఆయన స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇది నిజంకాదని, ఆయన న్యూయార్క్‌లో ఉన్నారని తాజా సమాచారం. ఆయనతోపాటు ఆయన భార్య అమీ నీరవ్ మోడీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఓ లగ్జరీ సూట్‌లో భార్యతో కలిసి...

ఓ లగ్జరీ సూట్‌లో భార్యతో కలిసి...

నీరవ్ మోడీ, ఆయన భార్య అమీ ప్రస్తుతం మాన్‌హట్టన్‌లోని జేడబ్ల్యూ మారియట్స్ ఎస్సెక్స్ హౌస్‌‌లోని లగ్జరీ సూట్‌లో ఉన్నట్లు విశ్వననీయ సమాచారం. ఈ లగ్జరీ సూట్ నీరవ్ మోడీకి చెందిన మాడిసన్ అవెన్యూ జ్యూవెలరీ రిటైల్ స్టోర్‌కు సమీపంలోనే ఉండడం గమనార్హం.
పీఎన్‌బీ స్కాం వెలుగుచూసిన సమయంలో కూడా వీరు అక్కడే ఉన్నారని, వారు తరచూ ఆ భవంతి బయటకు, లోపలకు వెళ్తూ కనిపించారని కూడా చెబుతున్నారు.

పాస్‌పోర్టుల రద్దుకు సీబీఐ, ఈడీ ప్రయత్నాలు...

పాస్‌పోర్టుల రద్దుకు సీబీఐ, ఈడీ ప్రయత్నాలు...

నీరవ్ మోడీ తన సోదరుడు నిషాల్‌ మోడీతో కలిసి జనవరి 1న భారత్ నుంచి ఉడాయించగా, అదే నెల 6న నీరవ్ మేనమామ, అతడి వ్యాపార భాగస్వామి మోహుల్ ఛోక్సి కూడా పరారయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి పాస్‌పోర్టులు రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ స్కాంలో నిందితులు ఎవరైనా, ఎంత పెద్దవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్రం ప్రకటించింది.

ప్రధాని దావోస్ పర్యటనలో నిరవ్ మోడీ?

ప్రధాని దావోస్ పర్యటనలో నిరవ్ మోడీ?

పీఎన్‌బీలో భారీ స్కాం వెలుగుచూడడం, ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దేశం నుంచి ముందే పరారైన.. ఈ నేపథ్యంలో అతడికి ప్రధాని మోడీతో సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ దావోస్ పర్యటనలో నీరవ్ మోడీ కూడా కనిపించారని, ఇందుకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. నీరవ్ మోడీ సొంతగా దావోస్ వెళ్లాడని, అక్కడ సీఐఐ ఈవెంట్‌లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత సీఈవోలతో ప్రధాని మోడీ దిగిన ఫొటోను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

ముఖేష్ అంబానీతో రిలేషన్!?

ముఖేష్ అంబానీతో రిలేషన్!?

పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో సంబంధాలున్నాయా? ఈ ప్రశ్నకు ‘అవును' అనే సమాధానం వినిపిస్తోంది. అయితే అది వ్యాపారపరమైన సంబంధం కాదట. ముఖేష్ అంబానీ మేనకోడలు ఇషితా సల్గావ్‌కర్‌ను నీరవ్ మోడీ తమ్ముడు నిషాల్ మోడీ వివాహం చేసుకున్నాడట. ఇషితా తండ్రి దత్తరాజ్ సల్గావ్‌కర్ గోవాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఈయన అంబానీల చెల్లెలు దీప్తి భర్త. వీరి కుమార్తెనే నిషాల్ మోడీ పెళ్లి చేసుకుంది. ఇవీ వీరిమద్య ఉన్న కుటుంబ సంబంధాలు.

జస్ట్.. పార్టీ ఇచ్చిన అంబానీ, అంతే!

జస్ట్.. పార్టీ ఇచ్చిన అంబానీ, అంతే!

2016 డిసెంబర్ 4న నిషాల్ మోడీ, ఇషితా సల్గావ్‌కర్‌ల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఇటు పారిశ్రామికవేత్తలతోపాటు అటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే వీరి వివాహానికి ముందు ముఖేష్ అంబానీ ముంబైలోని తన నివాసంలో ఒక పెద్ద పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీలో నిషాల్ మోడీ అన్న నీరవ్ మోడీ తళుక్కుమన్నాడు.. అంతే! అంతకుమించి నీరవ్ మోడీకి, రిలయన్స్ అధినేతకు ఎలాంటి సంబంధాలు లేవని సమాచారం.

English summary
Celebrity jeweller Nirav Modi, who left India just days before the CBI started investigating him in connection with a Rs. 11,300 crore Punjab National Bank (PNB) scam, has been traced to an apartment in New York's Manhattan. Sources have told NDTV that he is staying in a suite at JW Marriott's Essex House, a short walk away from his luxe Madison Avenue jewellery retail store.Yesterday, the government said his passport would be revoked and "no one, no matter how big, would be spared". Nirav Modi, his family members and business partner Mehul Choksi are accused of getting billions in credit from banks overseas after using PNB officials in Mumbai to issue fraud guarantees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X