• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీదేవి డెత్ మిస్టరీ: బోనీ కపూర్‌పై అనుమానాలు ఇవీ...

By Pratap
|
  Sridevi : Many Doubts On Boney Kapoor ?

  న్యూఢిల్లీ: అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై చిలువలు పలువలుగా వార్తలు వస్తున్నాయి. ఆకస్మిక గుండె పోటుతో శ్రీదేవి మరణించినట్లు భావించారు. కానీ, ఇప్పుడు ఆ ఊసు కూడా రావడం లేదు. ఆమె మరణం ప్రస్తుతం ఓ మిస్టరీగానే మారింది.

  శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి మరణం వెనక నేరపూరిత కారణాలు ఉన్నాయని దుబాయ్ పోలీసులు భావించడం లేదని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీదేవి భౌతిక కాయం చెడిపోకుండా ఎంబమింగ్ ప్రక్రియ నిర్వహించి మరికొన్ని రోజులు దుబాయ్ మార్చురీలోనే ఉంచాలని నిర్ణయించారు.

  బోనీ కపూర్ నుంచి ఏం తేల్చుకోవాలని...

  బోనీ కపూర్ నుంచి ఏం తేల్చుకోవాలని...

  శ్రీదేవి మరణం వెనక నేరపూరిత కారణాలున్నాయని భావించనప్పుడు దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ను ఎందుకు విచారిస్తున్నారనేది ప్రశ్న. శ్రీదేవి అపస్మారక స్థితిలో ఉండడం చూసిన బోనీ కపూర్ హోటల్ వైద్యుడిని పిలువకుండా తన మిత్రుడికి ఫోన్ చేసి అతన్ని ఎందుకు పిలిచాడనేది పోలీసులు తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

  స్టార్ హోటల్లో ఇలా ఉంటాయి...

  స్టార్ హోటల్లో ఇలా ఉంటాయి...

  ప్రమాదాలు జరిగినప్పుడు హాజరు కావడానికి స్టార్ హోటళ్లలో అత్యవసర బృందం ఉంటుంది. వైద్యులు కూడా ఉంటారు. వైద్యులు లేకుంటే, వైద్య సహాయం అందించే ఏర్పాటు ఉంటుంది. మొదట వాళ్లకు చెప్పకుండా బోనీ కపూర్ తన మిత్రుడికి ఎందుకు చెప్పారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చనిపోయిందని తెలుసుకున్న తర్వాతనే మిత్రుడికి ఫోన్ చేశారా అనేది ప్రశ్న. విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్పాల్సి వచ్చిందనేదని మరో ప్రశ్న.

  ఇరువురి మధ్య గొడవలపై ఆరా...

  ఇరువురి మధ్య గొడవలపై ఆరా...

  శ్రీదేవికి, ఆమె భర్త బోనీ కపూర్‌కు మధ్య గొడవలేమైనా ఉన్నాయా అనేది పోలీసులు తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే శ్రీదేవి చివరిసారిగా చేసిన ఫోన్ కాల్స్‌పై వారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే శ్రీదేవి భౌతిక కాాయాన్ని అప్పగించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నారు.

  ప్రాసిక్యూషన్ వ్యవస్థ పటిష్టమైంది...

  ప్రాసిక్యూషన్ వ్యవస్థ పటిష్టమైంది...

  దుబాయ్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ గల్ఫ్ దేశాల్లోకెల్లా శక్తివంతమైందని అంటారు. దాివల్ల పోస్టుమార్టం వ్యవహారం ఏదో ఆషామాషిగా చేసుకుని వెళ్తామంటే కుదదని అంటున్నారు. రాజు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేరని అంటున్నారు. అందువల్ల ప్రాసిక్యూషన్ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనని అంటున్నారు.

  అమర్ సింగ్ మాటలపై విస్మయం...

  అమర్ సింగ్ మాటలపై విస్మయం...

  గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న అంశాలను అధికారులు, దౌత్యవేత్తలు, మీడియా కూడా బయటకు వెల్లడించడానికి వీల్లేదని చెబుతారు. అబుదాబి షేక్‌తో తాను మాట్లాడినట్లు భారత రాజకీయ నాయకుడు అమర్ సింగ్ చెప్పుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దుబా, అబిదాబి పోలీసు, అధికార, రాజ్య వ్యవస్థలు వేర్వేరు.

  బోనీకి ఫ్రెండ్స్ దూరం...

  బోనీకి ఫ్రెండ్స్ దూరం...

  దుబాయ్‌లో శ్రీదేవి భర్త బోనీ కపూర్‌కు పెద్ద సంఖ్యలో మిత్రులున్నారని తెలుస్తోంది. కేసు తీవ్రత కారణంగా వారు ఎవరు కూడా బోనీ కపూర్‌తో మాట్లాడేందుకు ధైర్యం ప్రదర్శించడం లేదని అంటున్నారు. శ్రీదేవి మద్యం సేవించదని, అప్పుడప్పుడు వైన్ తీసుకుంటుందని బాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు.

  ఇలా అయితేనే భౌతిక కాయం..

  ఇలా అయితేనే భౌతిక కాయం..

  నేరం జరగలేదని, శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించిందని తేలితేనే భౌతిక కాయాన్ని అప్పగిస్తారు. ప్రాసిక్యూటర్ అల్ నయీబ్ ఆ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఫోరెన్సిన్ నివేదికతో ఆయన సంతృప్తి చెందినట్ల తెలుస్తోంది. అందుకే ఆయన బోనీ కపూర్‌ను, హోటల్ సిబ్బందిని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. శ్రీదేవి ఫోన్ కాల్ రికార్డులతో పాటు హోటల్ సిసిటీవీ ఫుటేజీ మొత్తం తనకు అప్పగించాలని ఆయన ఆదేశించారు. దీని కారణంగా శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.

  English summary
  The Dubai prosecution wants to clarify its doubts fron Sridevi's husband Beney Kapoor.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X